Young people: కార్తీక స్నానాలకు వెళ్లి కృష్ణానదిలో యువకులు గల్లంతు
కృష్ణాజిల్లా తోట్లవల్లూరు మండలంలో విషాదం చోటుచేసుకుంది.

Drown
Young people: కృష్ణాజిల్లా తోట్లవల్లూరు మండలంలో విషాదం చోటుచేసుకుంది. కార్తీక సోమవారం స్నానాలు చేసేందుకు వెళ్లి కృష్ణానదిలో ముగ్గురు యువకులు గల్లంతయ్యారు.
కార్తీక మాసం మొదలయ్యాక రెండవ సోమవారం కావడంతో ఉదయాన్నే స్నానాలు చేసేందుకు తోట్లవల్లూరు కృష్ణానది పాయలోకి వెళ్లారు ముగ్గురు యువకులు.
ఒకే గ్రామానికి చెందిన 20 ఏళ్లలోపు యువకులు నరేంద్ర, నాగరాజు, పవన్‌లు నీటిలో గల్లంతయ్యారు. యువకుల మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇప్పటివరకు ఇద్దరి మృతదేహాలు లభ్యం అవ్వగా.. మరొక యువకుడి కోసం గాలిస్తున్నారు పోలీసులు.