ప్లాస్టిక్ ఇవ్వండి..టిఫిన్ తినండి

  • Published By: madhu ,Published On : February 24, 2020 / 08:29 AM IST
ప్లాస్టిక్ ఇవ్వండి..టిఫిన్ తినండి

Updated On : February 24, 2020 / 8:29 AM IST

మీకు కాఫీ తాగాలని ఉందా..టిఫిన్ తినాలని ఉందా..ఆ ఏముంది..ఇంట్లో చేసుకోవచ్చు..లేదా హోటల్‌లో ఎంచక్కా ఆరగించవచ్చు అని అంటారు..కాదా..కానీ బీచ్‌లో సముద్రం అలలు..ఒడ్డున కూర్చొని ఆస్వాదిస్తే..ఎలా ఉంటుంది. అయితే..దీనికో కండీషన్ ఉంది. ప్లాస్టిక్ ఇచ్చేయండి..

మీకు టీ, టిఫిన్, కాఫీ ఇస్తామంటోంది. ఇండియా యూత్ ఫర్ సొసైటీ..విశాఖ బీచ్ రోడ్డులో మొబైల్ పార్లర: ఏర్పాటు చేశారు. 2019, డిసెంబర్ 27వ తేదీన బీచ్ రోడ్డులోని వైఎంసీ ఎదురుగా ప్లాస్టిక్ పార్లర్‌ ప్రారంభమైంది. గివ్ ప్లాస్టిక్..గెట్ ప్రొడక్ట్ నినాదంతో ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణ ఈ పార్లర్ మొదలు పెడుతున్నారు. 

ప్లాస్టిక్ భూతం ప్రపంచాన్నే కుమ్మేస్తోంది. పర్యావరణాన్ని కాలుష్యం చేస్తోంది. దీనిని పరిష్కరించాలంటే..ప్లాస్టిక్‌ను వదిలేయాలని ప్రభుత్వాలు చెబుతున్నాయి. కానీ..కొన్ని ప్రాంతాల్లో ఇంకా ప్లాస్టిక్ వాడుతున్నారు. వీరికి అవగాహన పెంచేందుకు…మీ దగ్గరున్న ప్లాస్టిక్ ఇస్తే..టిఫిన్ ఇస్తామని ఇండియా యూత్ ఫర్ సొసైటీ (IYFS) విశాఖపట్టణంలో వినూత్నంగా ఓ కార్యక్రమం నిర్వహించింది.. ఇందుకోసం ఏకంగా ఒక స్టాల్‌ను ఏర్పాటు చేసింది.

పర్యావరణానికి హాని కలిగిస్తున్న ప్లాస్టిక్‌ను ప్రజల నుంచి తీసుకుని…వారికి టీ, కాఫీ, టిఫిన్ అందిస్తున్నారు. వీరు చేస్తున్న ప్రయత్నంపై ప్రశంసలు కురుస్తున్నాయి. ప్రజలు వాడి పడేసిన..ప్లాస్టిక్‌ను తీసుకుని..దానికి బదులుగా కాఫీ, ఓ వస్త్ర సంచి, టిఫిన్ అందిస్తోంది. 2018 నుంచే ఈ సంస్థ ఇలా పనిచేయడం ప్రారంభించింది. విశాఖలో ప్రస్తుతం స్టార్ట్ అయ్యింది. 

* కేజీ ప్లాస్టిక్‌కు ఓ కాఫీ, * 2 కేజీలకు క్లాత్ బ్యాగు, * 3 కేజీలకు టిఫిన్, * 4 కేజీలకు జూట్ బ్యాగ్ ఇస్తున్నారు. * వస్తువులు వద్దంటే..డబ్బులు కూడా ఇవ్వడం విశేషం. 

* ఆర్కే బీచ్ తీరానా వైఎంసీఏ ఎదురుగా ప్లాస్టిక్ పార్లర్ పేరిట ఈ సేకరణ జరుగుతోంది. * ఉదయం 5.30 నుంచి 8.30 గంటల వరకు ప్లాస్టిక్‌ను స్వీకరిస్తోంది. * మొత్తం సొసైటీలో 15 మంది సభ్యులున్నారు. 

మరి ఈ ప్లాస్టిక్‌ను తీసుకుని వీరు ఏం చేస్తారు. 
ప్లాస్టిక్‌ను తీసుకుని రీ సైక్లింగ్ చేసి వివిధ వస్తువులను తయారు చేస్తున్నారు. ఈ సంస్థకు జీవీఎంసీ తోడ్పాటును అందిస్తోంది. కాపులుప్పాడ వద్ద పరిశ్రమలో ప్లాస్టిక్‌ను వస్తువులుగా మారుస్తున్నారు. వ్యర్థాల నిర్వాహణ, భూ వనరుల వినియోగంపై అవగాహన కలిగినప్పుడే పారిశుధ్యం సాధ్యమంటున్నారు.