తిరుమలలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆకస్మిక పరిశీలనలు

చైర్మన్ వద్దకు వెళ్లి టీటీడీ అందిస్తున్న సౌకర్యాలు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు భక్తులు.

తిరుమలలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆకస్మిక పరిశీలనలు

Updated On : January 5, 2025 / 8:23 PM IST

తిరుమలలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆకస్మిక పరిశీలనలు చేశారు. సామాన్య భక్తుడిలా శ్రీవారి ఆలయం వద్దకు వెళ్లిన చైర్మన్ బీఆర్ నాయుడు.. నాదనీరాజనం వద్ద కూర్చొని అక్కడి పరిస్థితులను పరిశీలించారు.

చైర్మన్ వద్దకు వెళ్లి టీటీడీ అందిస్తున్న సౌకర్యాలు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు భక్తులు. కూటమి ప్రభుత్వం వచ్చాక లడ్డూ, అన్నప్రాదాలు నాణ్యంగా రుచికరంగా ఉన్నాయని, పరిశుభ్రత పెరిగిందని భక్తులు అన్నారు. భక్తుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్న బీఆర్ నాయుడు అనంతరం బంగారు తిరుచ్చి వాహనసేవలో పాల్గొన్నారు.

కాగా, నిన్న టీటీడీ ఈవోతో టోకెన్ల జారీ ఏర్పాట్లపై బీఆర్‌ నాయుడు చర్చించిన విషయం తెలిసిందే. వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి సర్వదర్శన టోకెన్‌ సెంటర్ల ఏర్పాట్లను కూడా బీఆర్ నాయుడు నిన్న పరిశీలించారు. జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు వైకుంఠ ద్వారాలు తెరిచే ఉంటాయని ఆయన అన్నారు.

భక్తులు తొందర పడాల్సిన అవసరం లేదని చెప్పారు. భక్తులకు అనుగుణంగా ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. వీఐపీలకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని తెలిపారు. జనవరి 9న ఉదయం 5.30 గంటలకు కౌంటర్ల ద్వారా వైకుంఠ ద్వార సర్వదర్శన టోకెన్లు ఇస్తారు.

Visakha Central Jail : విశాఖ సెంట్రల్ జైల్లో హోంమంత్రి అనిత తనిఖీలు.. జైల్లో ఆ మొక్క చూసి షాక్..