Tirumala Tirupati Devasthanams: విప్రో, నెస్లే, ఒఎన్‌జీసీ కంటే తిరుపతి దేవస్థానం ఆస్తులు ఎక్కువే..!

స్టాక్ ఎక్స్ఛేంజ్ డేటా ప్రకారం.. ప్రస్తుత ట్రేడింగ్ ధరతో పోలిస్తే తిరుపతి దేవస్థానం యొక్క ఆస్తుల విలువ అనేక బ్లూ-చిప్ భారతీయ సంస్థల కంటే ఎక్కువగా ఉందని ఆర్థికవేత్తలు పేర్కొంటున్నారు.

Tirumala Tirupati Devasthanams: విప్రో, నెస్లే, ఒఎన్‌జీసీ కంటే తిరుపతి దేవస్థానం ఆస్తులు ఎక్కువే..!

TTD

Updated On : November 7, 2022 / 8:52 AM IST

Tirumala Tirupati Devasthanams: ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామి దేవస్థానం పరిధిలో ఈ ఏడాది సెప్టెంబర్ నెలాఖరు వరకు జాతీయ బ్యాంకుల్లో ఉన్న డిపాజిట్లు, బంగారం వివరాలను ఆలయ అధికారులు వెల్లడించారు. వీటినిబట్టి దేవాలయం నికర విలువ రూ. 2.5 లక్షల కోట్లుగా అంచనాగా ఉంది. అంటే పేరుపొందిన ఐటీ కంపెనీ విప్రో, ఫుడ్ అండ్ బెవరేజీ కంపెనీ నెస్లే, ప్రభుత్వ యాజమాన్యంలోని చమురు దిగ్గజాలు ఓఎన్జీసీ, ఐఓసీ మార్కెట్ క్యాపిటలైజేషన్ కంటే ఎక్కువ.

Tirumala Srivari Properties : శ్రీవారి ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేసిన టీటీడీ ..ఏఏ బ్యాంకుల్లో ఎంతెంత? ఏమేమి ఉన్నాయంటే..

దేవస్థానం ఆస్తులలో బ్యాంకుల్లో 10.25 టన్నుల బంగారు డిపాజిట్లు, 2.5 టన్నుల బంగారు ఆభరణాలు, జాతీయ బ్యాంకుల్లో సుమారు రూ. 16వేల కోట్ల డిపాజిట్లు, భారతదేశం అంతటా 960 ఆస్తులు ఉన్నాయని, వీటన్నింటిని కలిపితే రూ.2.5 లక్షల కోట్లకు పైగా దేవస్థానం ఆస్తులుగా ఉంటాయని ఆలయ అధికారులు తెలిపారు. స్టాక్ ఎక్స్ఛేంజ్ డేటా ప్రకారం.. ప్రస్తుత ట్రేడింగ్ ధరతో పోలిస్తే తిరుపతి దేవస్థానం యొక్క ఆస్తుల విలువ అనేక బ్లూ-చిప్ భారతీయ సంస్థల కంటే ఎక్కువగా ఉందని ఆర్థికవేత్తలు పేర్కొంటున్నారు. అయితే, భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు ఏడు కొండలపై కాటేజీలు, అతిథి గృహాలతో సహా అమూల్యమైన పురాతన ఆభరణాల వివరాలను ఆస్తుల వెల్లడిలో చేర్చలేదని ఆలయ అధికారులు ఒకరు తెలిపారు.

Tirumala Tirupati Devasthanams: టీటీడీ కీలక నిర్ణయం.. ఆ రోజు అందరికీ సర్వదర్శనం మాత్రమే..

బెంగళూరుకు చెందిన విప్రో గత శుక్రవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి రూ. 2.14 లక్షల కోట్ల మార్కెట్ విలువ కలిగి ఉండగా, అల్ట్రాటెక్ సిమెంట్ మార్కెట్ విలువ రూ. 1.99 లక్షల కోట్లుగా ఉంది. స్విస్ బహుళజాతి ఫుడ్ అండ్ డ్రింక్ మేజర్ నెస్లే యొక్క ఇండియా యూనిట్ రూ. 1.96 లక్షల కోట్ల మార్కెట్ విలువను కలిగి ఉంది. ప్రభుత్వ యాజమాన్యంలోని ఆయిల్ బెహెమోత్‌లు ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ), ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) కూడా తిరుమల తిరుపతి ఆలయ ట్రస్ట్ ఆస్తుల విలువ కంటే తక్కువ విలువను కలిగి ఉన్నాయి. పవర్ దిగ్గజం ఎన్టీపీసీ లిమిటెడ్, ఆటో తయారీదారులు మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్, ప్రపంచంలో అతిపెద్ద బొగ్గు ఉత్పత్తిదారు ఇండియా లిమిటెడ్, మైనింగ్ సమ్మేళనం వేదాంత, రియల్ ఎస్టేట్ సంస్థ డీఎల్ఎఫ్, అనేక ఇతర సంస్థలు. కేవలం కొన్ని కంపెనీలు మాత్రమే ఆలయ ట్రస్ట్ నెట్‌వర్త్ కంటే పెద్ద మార్కెట్ విలువను కలిగి ఉన్నాయి.

TTD: పెట్టుబడులు, డిపాజిట్లపై శ్వేతపత్రం విడుదల చేసిన టీటీడీ

ఇదిలాఉంటే ఫిబ్రవరిలో సమర్పించిన 2022-23 సంవత్సరానికి సుమారు రూ. 3,100 కోట్ల వార్షిక బడ్జెట్‌లో టీటీడీ బ్యాంకుల్లో నగదు డిపాజిట్ల ద్వారా వడ్డీ రూపంలో రూ. 668 కోట్లకు పైగా ఆదాయాన్ని అంచనా వేసింది. అలాగే, కొండ గుడి హుండీలో సుమారు 2.5 కోట్ల మంది భక్తులు నగదు కానుకల రూపంలోనే రూ. 1,000 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేశారు. టీటీడీ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, ఒడిశా, హర్యానా, మహారాష్ట్ర, న్యూఢిల్లీలలో పెద్ద సంఖ్యలో ఆలయాలను నిర్వహిస్తోంది.