TTD: పెట్టుబడులు, డిపాజిట్లపై శ్వేతపత్రం విడుదల చేసిన టీటీడీ

టీటీడీ ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి 2019 నుండి పెట్టుబడి మార్గదర్శకాలను మరింత బలోపేతం చేసిందని టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి శనివారం వెల్లడించారు. బోర్డు టీటీడీ నిధులను భారత ప్రభుత్వ సెక్యూరిటీలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సెక్యూరిటీలలో పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకున్నారని గ‌త కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో పుకార్లు వ్యాపించాయని, ఇవి పూర్తిగా అవాస్త‌వమని ఆయన అన్నారు

TTD: పెట్టుబడులు, డిపాజిట్లపై శ్వేతపత్రం విడుదల చేసిన టీటీడీ

TTD released statement on investments and deposits

TTD: టీటీడీ ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి 2019 నుండి పెట్టుబడి మార్గదర్శకాలను మరింత బలోపేతం చేసిందని టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి శనివారం వెల్లడించారు. బోర్డు టీటీడీ నిధులను భారత ప్రభుత్వ సెక్యూరిటీలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సెక్యూరిటీలలో పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకున్నారని గ‌త కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో పుకార్లు వ్యాపించాయని, ఇవి పూర్తిగా అవాస్త‌వమని ఆయన అన్నారు. ఈ ప్ర‌చారాన్ని టీటీడీ తీవ్రంగా ఖండిస్తోందని, హుండీ ఆదాయం గణనీయంగా తగ్గిన కరోనా కాలంలోనూ, స‌మ‌ర్థ‌వంతమైన ఆర్థిక నిర్వహణ ద్వారా టీటీడీ ఆదాయం పెరిగిందని తెలిపారు. శ్రీ‌వారి భక్తులు ఇలాంటి కుట్ర‌పూరిత త‌ప్పుడు ప్ర‌చారాన్ని న‌మ్మ‌వ‌ద్ద‌ని విజ్ఞ‌ప్తి చేశారు. టీటీడీ వివిధ బ్యాంకుల్లో చేసే న‌గ‌దు, బంగారు డిపాజిట్లు అత్యంత పారదర్శకంగా జరుగుతాయని వై.వి.సుబ్బారెడ్డి పేర్కొన్నారు.

పెట్టుబడులపై స్టేటస్ నోట్
1. టీటీడీ నియమ నిబంధనల ప్రకారం, మిగులు మొత్తాలను ఏ బ్యాంకు ఎక్కువ వ‌డ్డీ ఇవ్వ‌డానికి ముందుకొస్తుందో అలాంటి షెడ్యూల్డ్ బ్యాంకుల్లో మాత్ర‌మే పెట్టుబడి పెడుతున్నారు.
2. బ్యాంకుల్లో న‌గ‌దు, బంగారం డిపాజిట్ చేయ‌డానికి టీటీడీ బోర్డు ఆమోదించిన పెట్టుబడి మార్గదర్శకాల ప్రకారం అర్హతగల షెడ్యూల్డ్ బ్యాంక్‌లు, సంస్థల నుండి టిటిడి కొటేషన్లను ఆహ్వానిస్తుంది. ప్రభుత్వంచే ఆమోదించ‌బ‌డిన ప్రైవేట్ రంగ బ్యాంకులు కొటేషన్లు స‌మ‌ర్పించే అర్హ‌త పొంద‌డానికి అత్యధిక క్రెడిట్ రేటింగ్‌ను కలిగి ఉండాలి. ఆర్‭బీఐ ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ ప్రాసెస్‭లో భాగమైన బ్యాంకులు కొటేషన్లలో పాల్గొనడానికి ఆహ్వానించబడవు.
3. కేంద్ర ప్రభుత్వ లేదా రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీలలో పెట్టుబడి పెట్టకూడదని టిటిడి బోర్డు ఇప్పటికే తీర్మానించింది. ఈ ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీలలో పెట్టుబడులు పెట్టడం లేదు.
4. శ్రీవారి హుండీ ద్వారా స్వీకరించబడిన బంగారు కానుకలు 12 సంవత్సరాల దీర్ఘకాలిక బంగారు డిపాజిట్లలో గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ కింద కరిగించడం, శుద్ధి చేయడం, పెట్టుబడి పెట్టడం కోసం భారత ప్రభుత్వ మింట్‌కు పంపబడుతున్నాయి.
5. ట్రస్ట్ విరాళాలకు సంబంధించి ‘బ్యాంకులు సేకరించిన విరాళాలు’ ప్రస్తుత వడ్డీ రేటు ప్రకారం అదే బ్యాంకుల్లో పెట్టుబడి పెడుతున్నారు.

6. నాణేల త‌ర‌లింపు టీటీడీకి, బ్యాంకుల‌కు చాలా కష్టమైన పని. కాబట్టి పరకామణిలో నాణేలను సేకరించే బ్యాంకులు ప్రస్తుత వడ్డీ రేటు ప్రకారం అవే బ్యాంకుల్లో పెట్టుబడి పెడుతున్నారు.
7. 30 జూన్ 2019 నుంచి 30 సెప్టెంబర్ 2022 నాటికి పెట్టుబడులు (బ్యాంక్ వారీగా డిపాజిట్లు) జతచేయబడ్డాయి.

Instagram Vanish Mode : ఇన్‌స్టాగ్రామ్‌లో వానిష్ మోడ్ ఫీచర్.. మీ మెసేజ్ ఆటో డిలీట్ కావాలంటే.. ఇలా ఎనేబుల్ చేయండి..!