Tirupati Deputy Mayor Election: కూటమి ఖాతాలోకి తిరుపతి డిప్యూటీ మేయర్ పీఠం.. ఎన్నికైన టీడీపీ కార్పొరేటర్ మునికృష్ణ

తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఎన్నికలో టీడీపీ పంతం నెగ్గించుకుంది. ఉద్రిక్తతల మధ్య మంగళవారం డిప్యూటీ మేయర్ ఎన్నిక జరిగింది.

Tirupati Deputy Mayor Election: కూటమి ఖాతాలోకి తిరుపతి డిప్యూటీ మేయర్ పీఠం.. ఎన్నికైన టీడీపీ కార్పొరేటర్ మునికృష్ణ

Tirupati Municipality Deputy Mayor Election

Updated On : February 4, 2025 / 1:13 PM IST

Tirupati Deputy Mayor Election: తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఎన్నికలో కూటమి పంతం నెగ్గించుకుంది. ఉద్రిక్తతల మధ్య మంగళవారం డిప్యూటీ మేయర్ ఎన్నిక జరిగింది. తిరుపతి ఎస్వీ వర్శిటీ సెనెట్ హాలులో జరిగిన ఈ ఎన్నికలో కూటమికి చెందిన టీడీపీ అభ్యర్ధి మునికృష్ణ విజయం సాధించాడు. మునికృష్ణ కు 26 మంది, వైసీపీ అభ్యర్థి భాస్కర్ రెడ్డికి 21 మంది మద్దతు తెలిపారు.

Also Read: AP Municipality Elections : ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ హవా.. అక్కడ చక్రం తిప్పిన బాలయ్య..

తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక సోమవారమే జరగాల్సి ఉంది. అయితే, కోరం లేని కారణంగా అధికారులు ఎన్నిక ప్రక్రియను ఇవాళ్టికి వాయిదా వేశారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ లో మొత్తం 50 డివిజన్లు ఉండగా.. 47మంది కార్పొరేటర్లు ఉన్నారు. ఇవాళ జరిగిన డిప్యూటీ మేయర్ ఎన్నికకు 26మంది కావాల్సి ఉండగా.. తిరుపతి వైసీపీ ఎంపీ గురుమూర్తి ఆ పార్టీ కార్పొరేటర్లతో హాజరై వైసీపీ అభ్యర్థి భాస్కర్ రెడ్డిని బలపర్చారు. ఈ ఎన్నికలో టీడీపీ అభ్యర్థి మునికృష్ణ కు 26 ఓట్లు రావడంతో డిప్యూటీ మేయర్ గా మునికృష్ణ ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. ఇదిలాఉంటే.. ఉద్రిక్తల మధ్య డిప్యూటీ మేయర్ ఎన్నిక జరిగింది. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు ఎన్నికల కేంద్రం వద్ద అదనపు భద్రతను కల్పించారు. తిరుపతిలో 144 సెక్షన్ ను అమలు చేశారు.