ఉద్యోగం ఆశ చూపి వ్యభిచారం కూపంలోకి.. తిరుపతిలో వ్యభిచార ముఠా అరాచకాలు, ఖమ్మం యువతిపై అత్యాచారయత్నం

  • Published By: naveen ,Published On : October 10, 2020 / 12:36 PM IST
ఉద్యోగం ఆశ చూపి వ్యభిచారం కూపంలోకి.. తిరుపతిలో వ్యభిచార ముఠా అరాచకాలు, ఖమ్మం యువతిపై అత్యాచారయత్నం

Updated On : October 10, 2020 / 12:55 PM IST

tirupati prostitution : తిరుపతిలో వ్యభిచార ముఠా ఆగడాలు పెరిగిపోతున్నాయి. ఫేస్‌బుక్‌లో యువతులకు స్నేహం పేరుతో వల వేసి.. ఉద్యోగం ఆశ చూపి వ్యభిచారకూపంలోకి దింపుతున్నారు. ఇలాగే ఖమ్మం జిల్లాకు చెందిన యువతిని తిరుపతికి రప్పించింది ముఠా.. ఆమెను వ్యభిచార కూపంలోకి దింపేందుకు యత్నించింది.

యువతి ఒప్పుకోకపోవడంతో ఆమెపై అత్యాచారయత్నం చేశారు. బాగా కొట్టడంతో తీవ్రగాయాలపాలైన యువతి.. వారి నుంచి తప్పించుకుని ఎమ్మార్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. రుయా ఆస్పత్రిలో చికిత్స పొందిన అనంతరం ఆమె ఖమ్మంకు వెళ్లిపోయింది. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.