తిరుపతి స్విమ్స్ కోవిడ్ హాస్పిటల్ ప్రమాద ఘటనపై ప్రభుత్వం సీరియస్‌

  • Published By: naveen ,Published On : October 5, 2020 / 10:54 AM IST
తిరుపతి స్విమ్స్ కోవిడ్ హాస్పిటల్ ప్రమాద ఘటనపై ప్రభుత్వం సీరియస్‌

Updated On : October 5, 2020 / 11:25 AM IST

Tirupati SVIMS COVID centre incident: తిరుపతి స్విమ్స్ కోవిడ్ హాస్పిటల్ ప్రమాద ఘటనపై ఏపీ సర్కార్‌ సీరియస్‌ అయ్యింది. ప్రమాద ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్న డిప్యూటీ సీఎం ఆళ్ల నాని.. గాయపడిన కరోనా బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ వెంగమ్మకు ఆదేశించారు. మృతురాలు రాధిక కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా ఆర్ధికంగా ఆదుకుంటామని ఆళ్ల నాని ప్రకటించారు. ప్రమాద కారణాలపై నివేదిక ఇవ్వాలని ఇంజినీర్లను ఆదేశించిన మంత్రి ఆళ్ల నాని.. బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.

చిత్తూరు జిల్లా తిరుపతి స్విమ్స్‌ శ్రీ పద్మావతి స్టేట్‌ కోవిడ్‌ ఆస్పత్రిలో ఆదివారం(అక్టోబర్4,2020) రాత్రి ప్రమాదం చోటు చేసుకుంది. కొత్తగా నిర్మిస్తున్న ఈ భవనం గ్రౌండ్‌, మొదటి అంతస్తును కరోనా వార్డుగా వినియోగిస్తున్నారు. పై మూడంతస్తుల నిర్మాణం పనులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాత్రి 10.10 గంటల సమయంలో నిర్మాణంలో ఉన్న ఓ గోడ కూలి విధి నిర్వహణలో ఉన్న మహిళా వర్కర్‌ రాధిక(37)పై పడింది. అలాగే, కరోనా బారిన పడి చికిత్స కోసం ఆస్పతిలోకి ప్రవేశిస్తున్న మరో ఇద్దరు గాయాలపాలయ్యారు. పెద్ద పెట్టున గోడకూలిన శబ్దానికి సిబ్బంది, కరోనా బాధితులు హడలిపోయారు.