Tomato Price Hike : కిలో రూ.100 కి చేరిన టమాట ధర

చిత్తూరు జిల్లా మదనపల్లె వ్యవసాయ మార్కెట్ లో కిలో టమాట వందరూపాయలు పలికింది.

Tomato Price Hike :  కిలో రూ.100 కి చేరిన టమాట ధర

Tomato Price Hike

Updated On : November 17, 2021 / 2:59 PM IST

Tomato Price Hike :  చిత్తూరు జిల్లా మదనపల్లె వ్యవసాయ మార్కెట్ లో కిలో టమాట వందరూపాయలు పలికింది. వరసగా కురస్తున్న వర్షాలతో పంట దిగుబడి తగ్గటంతో నిన్న కిలో రూ. 100 కి విక్రయించారు. తంబళ్లపల్లె, రాష్ట్ర సరిహద్దులోని కర్ణాటకలోని రాయల్ పాడు శ్రీనివాసపురం క్రాస్, అడగళ్ ప్రాంచాలనుంచి రైతులు మదనపల్లె మార్కెట్కు నిన్న 148 టన్నులు సరుకు మాత్రమే తీసుకువచ్చారు.

Also Read : Sivalayam Dhwaja Stambham : గుడిలో అపశ్రుతి- విరిగి పడ్డ ధ్వజస్తంభం

ఇందులో20 టన్నులు కిలో 100 రూపాయల చొప్పున, మిగతాదానిలో ఏ గ్రేడ్ రకం కిలో 60 నుంచి 100 రూపాయలు చొప్పున… బీ గ్రేడ్ రకం కిలో 16 రూపాయల నుంచి 58 రూపాయల వరకు ధర పలికింది. టమాటలను ఇక్కడినుంచి తమిళనాడు, ఉత్తరాంధ్ర, తూర్పు ఆంధ్రకు సప్లై చేయనున్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్లోనూ మంగళవారం రైతులు టమాట కిలో 100 రూపాయలకు విక్రయించారు.