Chandrababu Arrest : రేపే చంద్రబాబు, భువనేశ్వరిల పెళ్లి రోజు .. ఈరోజే అరెస్ట్

నారా చంద్రబాబు భువనేశ్వరిలో పెళ్లి రోజు రేపే..అంటే సెప్టెంబర్ 10న నారా చంద్రబాబు భువనేశ్వరిల 42 పెళ్లి రోజు. రేపు పెళ్లి రోజు అనగా చంద్రబాబును ఈ రోజు సీఐడీ పోలీసలు అరెస్ట్ చేశారు.

Chandrababu Arrest : రేపే చంద్రబాబు, భువనేశ్వరిల పెళ్లి రోజు .. ఈరోజే అరెస్ట్

Chandrababu Bhuvaneshwari 42nd marriage anniversary

Chandrababu Bhuvaneswari : తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబును సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. చంద్రబాబుని అరెస్ట్ చేసిన తరువాత ఆయన భార్య భువనేశ్వరి కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. తన భర్త చంద్రబాబుకు మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుకున్నారు. ఎవరికైనా మనస్సుకు బాధ కలిగితే కష్టాలు వస్తే తల్లికి చెప్పుకుంటారు..అందుకు తన కష్టాన్ని దుర్గమ్మ తల్లికి చెప్పుకుందామని వచ్చానని అరెస్ట్ అయిన తన భర్తకు మనోధైర్యాన్ని కలిగించాలని అమ్మను కోరానని ఆవేదనతో వెల్లడించారు.

ఇదిలా ఉంటే నారా చంద్రబాబు భువనేశ్వరిలో పెళ్లి రోజు రేపే..అంటే సెప్టెంబర్ 10న నారా చంద్రబాబు భువనేశ్వరిల పెళ్లి రోజు. తెలుగు తెరపై చెరగని ముద్ర వేసిన నటుడు, విశ్వవిఖ్యాత  నందమూరి తారకరామారావు కుమార్తె భువనేశ్వరిని..నారా చంద్రబాబు నాయుడికిచ్చి వివాహం జరిపించారు. 1981,సెప్టెంబర్ 10న వీరి వివాహం జరిగింది. ఉదయం 8 గంటల 6 నిమిషాలకు చెన్నైలోని మౌంట్ రోడ్డులోని గవర్నమెంట్ లో ఎస్టేట్ కలైవాసర ఆరంగంలో వీరి వివాహ వేడుక జరిగింది.

Chandrababu Arrest : చంద్రబాబు అరెస్టు, ఏపీ వ్యాప్తంగా టీడీపీ నేతలు హౌస్ అరెస్ట్

అప్పటికే చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ, పరిశ్రమలు, పురావస్తు శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పెళ్లిరోజుకి ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. మంత్రిగా ఉన్నారు. చంద్రబాబు చురుకుదనం, విజన్ నచ్చిన ఎన్టీఆర్.. తన కుమార్తెనిచ్చి వివాహం చేశారు. వారి వివాహం జరిగిన రెండేళ్లకు లోకేశ్ జన్మించారు. లోకేశ్ కు చంద్రబాబు తన బావమరిది..ప్రముఖ సినీ నటుడు బాలకృష్ణ పెద్ద కుమార్తె బ్రాహ్మణితో వివాహం జరిపించారు. వారికి ఓ బాబు. పేరు దేవాన్ష్.

ఓ సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన చంద్రబాబు విద్యార్ది సంఘం నాయకుడి నుంచి అంచెలంచెలుగా ఎదిగారు. ఆయనలోని విజనరీని గుర్తించిన రామారావు తన కుమార్తెనిచ్చి వివాహం జరిపించారు. అలా రాజకీయాల్లోకి వచ్చిన చంద్రబాబు ఎమ్మెల్యేగా..మంత్రిగా..ముఖ్యమంత్రిగా..ప్రతిపక్ష నేతగా ఎన్నో రకాల రాజకీయ జీవితాన్ని చవిచూశారు. విజన్ ఉన్న నాయకుడిగా పేరొందారు.

Nara Bhuvaneshwari : చంద్రబాబు అరెస్ట్ తరువాత దుర్గమ్మను దర్శించుకున్న నారా భువనేశ్వరి.. ఏపీ ప్రజలకు విజ్ఞప్తి

రేపటికి అంటే సెప్టెంబర్ 10(2023)కు చంద్రబాబు,భువనేశ్వరిల వివాహం జరిగి 42ఏళ్లు పూర్తికానున్నాయి. 1981లో వివాహంతో ఒక్కటైనా ఈ జంట ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు. చంద్రబాబు రాజకీయాల్లో బిజీగా ఉన్నా ఓ పక్క హెరిటేజ్ డైరీని కూడా నిర్వహిస్తు మరోపక్క కుటుంబాన్ని కూడా చక్కగా సమర్థవంతంగా నిర్వహించేవారు భువనేశ్వరి.

ఈక్రమంలో చంద్రబాబు రేపు 42వ వివాహ దినోత్సం అనగా ఈరోజే (సెప్టెంబర్ 9,2023) అరెస్ట్ అయ్యారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేశారు ఏపీ సీఐడీ పోలీసులు. స్కిల్ డెవలప్ మెంట్ లో రూ.550 కోట్ల కుంభకోణం జరిగిందని..ఈ స్కామ్ లో చంద్రబాబు ప్రధాన సూత్రధారిగా ఉన్నారనే ఆరోపణలో చంద్రబాబును అరెస్ట్ చేశారు. రేపు పెళ్లి రోజు అనగా ఈరోజు చంద్రబాబు అరెస్ట్ కావటం గమనించాల్సిన విషయం..