TSPSC Paper Leak : ఆ ఇద్దరికి భారీగా అందిన డబ్బులు.. TSPSC పేపర్ లీక్ కేసులో కీలక విషయాలు
ప్రవీణ్, రాజశేఖర్, తోటి ఉద్యోగులను విచారించిన సిట్ అధికారులు.. ఇద్దరూ కలిసే పేపర్ లీక్ చేసినట్లు గుర్తించారు. మార్చి 5న జరిగిన పేపర్ లీకేజీ వ్యవహారంలో ప్రవీణ్, రాజశేఖర్ కి భారీగా డబ్బులు అందినట్లుగా సమాచారం అందుతోంది.(TSPSC Paper Leak)

TSPSC Paper Leak : రాష్ట్రంలో సంచలనం రేపిన టీఎస్ పీఎస్ సీ క్వశ్చన్ పేపర్ లీకేజీ కేసులో సిట్ అధికారులు దర్యాఫ్తు ముమ్మరం చేశారు. కమిషన్ కార్యాలయంలో ప్రవీణ్, రాజశేఖర్, తోటి ఉద్యోగులను విచారించిన సిట్ అధికారులు.. ఇద్దరూ కలిసే పేపర్ లీక్ చేసినట్లు గుర్తించారు. మార్చి 5న జరిగిన పేపర్ లీకేజీ వ్యవహారంలో ప్రవీణ్, రాజశేఖర్ కి భారీగా డబ్బులు అందినట్లుగా సమాచారం అందుతోంది.
బుధవారం 2 గంటలకు పైగా సిట్ అధికారులు ప్రవీణ్, రాజశేఖర్, ఇతర ఉద్యోగులను విచారించారు. వారి పని చేసే క్యాబిన్స్ కూడా పరిశీలించారు. ప్రవీణ్, రాజశేఖర్ తో ముఖాముఖి మాట్లాడిన అధికారులు.. పేపర్ లీకేజీకి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. అలాగే సర్వర్లను ఎలా మెయింటేన్ చేస్తారు? పాస్ వర్డులు, అడ్రస్ లు ఎలా మెయింటేస్ చేస్తారు? తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆ పాస్ వర్డ్ లను ప్రవీణ్, రాజశేఖర్ ఏ విధంగా బ్రేక్ చేశారు అనే వివరాలు తెలుసుకున్నారు అధికారులు.(TSPSC Paper Leak)
సిట్ చీఫ్ స్వయంగా ఆ ఇద్దరితో మాట్లాడారు. కంప్యూటర్లను కూడా పరిశీలించారు. కంటప్యూర్ ఆపరేటర్ తో కూడా మాట్లాడారు. సిట్ అధికారుల వెంట కొంతమంది నిపుణులు కూడా ఉన్నారు. వారు కమిషన్ చైర్మన్, కార్యదర్శి సిస్టమ్స్ ను పరిశీలించారు. పేపర్ లీకేజీకి సంబంధించి వీలైనంత త్వరగా రిపోర్టును టీఎస్ పీఎస్ సీకి అందించేందుకు సిట్ బృందం కసరత్తు చేసింది.
Also Read..Dasoju Sravan: బండి సంజయ్ నేతృత్వంలోనే టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్.. దాసోజు శ్రవణ్ ఆరోపణ
రేపు 9మంది నిందితుల కస్టడీ పిటిషన్ నాంపల్లి కోర్టు బెంచ్ ముందుకి రానుంది. మరోవైపు రిపోర్టును కూడా అతి తొందరగా సమర్పించే పనిలో ఉంది సిట్ బృందం. మార్చి 5 జరిగిన అసిస్టెంట్ ఇంజినీర్(సివిల్) క్వశ్చన్ పేపర్ తో మరికొన్ని పరీక్షల క్వశ్చన్ పేపర్లను ప్రవీణ్, రాజశేఖర్ లీక్ చేశారనే అభియోగాలు ఉన్నాయి. ఈ క్రమంలో దీనికి సంబంధించి లోతైన విచారణ చేయాల్సిన అవసరం ఉంది.
Also Read..TSPSC Paper Leak : ఆ యువతి కోసమే.. TSPSC పేపర్ లీక్ వ్యవహారంలో సంచలన ట్విస్ట్
మరోవైపు టీఎస్ పీఎస్ సీ కార్యాలయం పరిసర ప్రాంతాల్లో పోలీసులు 144 సెక్షన్ విధించారు. కార్యాలయం పరిసర ప్రాంతాల్లో ఐదుగురికి మించి గుమిగూడవద్దని ఆదేశాలు జారీ చేశారు. ర్యాలీలు, ధర్నాలకు అనుమతి లేదని పోలీసులు తేల్చి చెప్పారు. ఏఈ(అసిస్టెంట్ ఇంజినీర్-సివిల్) క్వశ్చన్ పేపర్ లీక్ వ్యవహారంలో విద్యార్థి సంఘాలు, పలు పార్టీల నేతలు, కార్యకర్తలు కమిషన్ కార్యాలయం ముందు ఆందోళనలు నిర్వహించారు. దీంతో పోలీసులు ఆంక్షలు విధించారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.(TSPSC Paper Leak)