Anand Sai : అలిపిరి మెట్ల మార్గానికి కొత్త ఆర్చ్.. నేను, పవన్ దాన్ని డెవలప్ చేయాలి అనుకున్నాము.. టీటీడీ బోర్డు మెంబర్ ఆనంద్ సాయి..
తాజాగా ఓ ఇంటర్వ్యూలో టీటీడీ బోర్డు మెంబర్ గా తనకు కొన్ని పనులు చేయాలని ఉందని తెలిపారు ఆనంద్ సాయి.

TTD Board Member Anand Sai wants to Some Developments in Tirumala Including Alipiri Entrance
Anand Sai : ఆర్ట్ డైరెక్టర్, స్థపతి, పవన్ కళ్యాణ్ ఫ్రెండ్ ఆనంద్ సాయి ప్రస్తుతం టీటీడీ బోర్డు మెంబర్ గా ఉన్న సంగతి తెలిసిందే. ఎన్నో ఆలయాలకు స్థపతిగా నిర్మాణంలో భాగమయ్యారు. యాదాద్రి ఆలయాన్ని చీఫ్ ఆర్కిటెక్ట్ గా కట్టించారు. ఆలయాలపై ఆనంద్ సాయికి ఉన్న అవగాహన తోనే పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం వచ్చాక టీటీడీలో బోర్డు మెంబర్ గా అవకాశం ఇచ్చారు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో టీటీడీ బోర్డు మెంబర్ గా తనకు కొన్ని పనులు చేయాలని ఉందని తెలిపారు ఆనంద్ సాయి.
Also Read : Anand Sai – Pawan Kalyan : ఇది కదా ఫ్రెండ్షిప్ అంటే.. 15 రోజులు కాల్ చేయలేదు.. కానీ యాక్సిడెంట్ అవ్వగానే..
ఆనంద్ సాయి తిరుమలలో చేయాలనుకుంటున్న పనుల గురించి మాట్లాడుతూ.. వెయ్యి కాళ్ళ మండపం మళ్ళీ కట్టాలి అని ఉంది. దానికి డిజైన్స్ కూడా గీసాను. బోర్డు మెంబర్ అయ్యాక పాజిబిలిటీ ఉందా లేదా అని చూసాను. కానీ దానికి స్థలపురాణం ఉంటుంది. కాబట్టి అది జరుగుతుందో లేదో. అలాగే నేను, పవన్ గారు మెట్ల దారి డెవలప్ చేయాలి అనుకున్నాము. క్యూ లైన్స్ కూడా ఇంకా బాగు చేయాలి. క్యూ లైన్స్ వెయిటింగ్ లో మధ్యలో ఓ వెయ్యి మంది కూర్చునేలా ప్లేస్ ఏర్పాటు చేసి కళలు, ప్రవచనాలు, దేవుడి ఈవెంట్స్ పెట్టేలా ప్లాన్స్ అనుకున్నాము. ఆ క్యూ లైన్ అంతా దేవుడి భక్తితో ఉండాలి. భక్తితోనే వెళ్ళాలి.
అలిపిరి మెట్ల మార్గంకు ఆర్చ్ డిజైన్ చేయాలి అని ఉంది. స్వామి వారి చరిత్ర కనపడేలా ఆర్చ్ చేయాలని అనుకున్నాను. రీసెంట్ బోర్డు మీటింగ్ లో చెప్తే చెయ్యమన్నారు. నేను దానికి సంబంధించిన డిజైన్ గీయడం మొదలుపెట్టాను. తిరుమలలో కష్టపడుతున్న కార్ డ్రైవర్స్, వాళ్ళ యూనియన్ కి మంచి చేయాలి. ఇలా చాలా ఉన్నాయి. ఇంకా పై వాళ్ళు కూడా ఓకే చేసి అప్రూవల్స్ ఇవ్వాలి. నేను బోర్డు మెంబర్ గా ఉన్నప్పుడు స్వామివారికి, తిరుమల అభివృద్ధికి ఏదో ఒకటి చేయాలి అని తెలిపారు.
Also Read : Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఎక్కువగా ఏ పాటలు వింటాడో తెలుసా? ఆనంద్ సాయి చెప్పిన సమాధానం విని ఆశ్చర్యపోతారు..