కొండపై కండీషన్స్ : శ్రీ వారి దర్శనం 11వ తేదీ నుంచి..రోజుకు 3 వేల మందికి మాత్రమే

కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ ప్రకటించడంతో తిరుమల శ్రీ వారి దర్శనాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భక్తులకు వెంకన్న దర్శనం నోచుకోలేదు. తాజాగా కేంద్రం ఇచ్చిన సడలింపుల్లో భాగంగా శ్రీ వారి దర్శనం కల్పించాలని TTD నిర్ణయించింది. దీనికి సంబంధించిన వివరాలను టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు.
ప్రతి రోజు మూడు వేల మంది భక్తులకు మాత్రమే దర్శనానికి అనుమతినవ్వడం జరిగిందని, ఈ నెల 11వ తేదీ నుంచి శ్రీ వారి దర్శనం ఉంటుందన్నారు. ఉదయం 6.30 గంటల నుంచి రాత్రి 7.30 వరకు మాత్రమే ఉంటుందని, దేశ వ్యాప్తంగా రాత్రి వేళ కర్ఫ్యూ ఉండడంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. ఇక VIP దర్శనం కేవలం గంట మాత్రమే కేటాయించామని (ఉదయం 6.30 నుంచి 7.30 వరకు) తెలిపారు.
దర్శనానికి ఆన్ లైన్ ద్వారా రిజిస్టర్ చేసుకోని వారు..నేరుగా తిరుపతికి వచ్చి చేసుకొనే అవకాశం కల్పించామన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం నడచుకుంటామని, 65 సంవత్సరాలు దాటిన వృద్ధులు, 10 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు అమలు చేయవద్దని చెప్పిందని..ఇదే పాటిస్తామన్నారు. కంటైన్ మెంట్ జోన్లు, రెడ్ జోన్ల నుంచి వచ్చే భక్తులకు దర్శనానికి రావొద్దని సూచించారు.