12 వేల వాహనాలకు పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశాం: వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై టీటీడీ ఈవో

భద్రతపై ప్రత్యేక చర్యలు చేపట్టామమని, టోకెన్లు ఇచ్చే కేంద్రాల వద్ద విజిలెన్స్, పోలీసుల సాయంతో భద్రత ఉంటుందని తెలిపారు.

12 వేల వాహనాలకు పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశాం: వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై టీటీడీ ఈవో

TTD EO Shyamala Rao

Updated On : January 7, 2025 / 5:13 PM IST

వైకుంఠ ఏకాదశి (జనవరి 10న) వేళ 10 రోజులపాటు వైకుంఠ ద్వారాలు తెరిచి ఉంచుతామని టీటీడీ ఈవో శ్యామలరావు అన్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేశామని, 12 వేల వాహనాలకు పార్కింగ్ స్థలాలు ఏర్పాట్లు చేశామని తెలిపారు.

వీఐపీలకు రాంభకిఛ వద్దే వాహనాలు అనుమతి ఉంటుందని చెప్పారు. భద్రతపై ప్రత్యేక చర్యలు చేపట్టామమని, టోకెన్లు ఇచ్చే కేంద్రాల వద్ద విజిలెన్స్, పోలీసుల సాయంతో భద్రత ఉంటుందని తెలిపారు. అన్న ప్రసాద కేంద్రం ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు అందుబాటులో ఉంటుందని అన్నారు.

ఆలయంలో అలంకరణ ప్రత్యేక నిపుణులతో చేయిస్తున్నామని తెలిపారు. 3000 శ్రీవారి సేవకులు సేవలు వాడుకుంటామని చెప్పారు. పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టామని అన్నారు. మహాకుంభమేళ వేళ టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసిందని తెలిపారు. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు జరగనుందని, 2.89 ఎకరాల భూమి కుంభమేళాలో కేటాయించారు, అక్కడ నమూనా ఆలయాన్ని ఏర్పాటు చేస్తామని అన్నారు.

శ్రీవారి ఆలయం జరిగే అన్ని సేవలు, కైంకర్యాలు నమూనా ఆలయంలో నిర్వహిస్తామని తెలిపారు. జనవరి 18, 26.. ఫిబ్రవరి 3, 26 తేదిలలో కల్యాణోత్సవం నిర్వహిస్తామని అన్నారు. రేపు తిరుమల నుంచి కుంభమేళాకి కల్యాణ రథం ప్రారంభం అవుతుందని తెలిపారు.

ఐసీయూలో ప్రశాంత్ కిశోర్.. ఆమరణ నిరాహార దీక్ష కొనసాగుతుందని స్పష్టం