శ్రీవారి దర్శనానికి టీటీడీ కసరత్తు… రోజుకు 7 వేల మంది భక్తులు మాత్రమే

  • Published By: srihari ,Published On : May 16, 2020 / 09:38 AM IST
శ్రీవారి దర్శనానికి టీటీడీ కసరత్తు… రోజుకు 7 వేల మంది భక్తులు మాత్రమే

Updated On : May 16, 2020 / 9:38 AM IST

తిరుమల శ్రీవారి దర్శనానికి టీటీడీ కసరత్తు చేస్తోంది. తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో లాక్ డౌన్ అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించే విషయంపై టీటీడీ కసరత్తు చేస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నూతన మార్గదర్శకాల ప్రకారం స్వామి వారి దర్శనానికి అనుమతిస్తే భక్తులను ఎలా అనుమతించాలన్న దానిపై అధికారులు అంతర్గతంగా సమాలోచనలు చేస్తున్నారు. టీటీడీ ఉద్యోగులు కుటుంబ సభ్యులకు తొలి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. అనంతరం స్థానికులతోపాటు ఇతర ప్రాంతాల వారికి అవకాశం ఇవ్వనున్నారు. 

ఆలయంలో భక్తులు భౌతిక దూరం పాటించేలా మార్కింగ్ చేయనున్నారు. రోజుకు ఏడు వేల మందిని మాత్రమే అనుమతించేలా ఏర్పాట్లు చేస్తోంది. పరిమిత సంఖ్యలో ఆన్ లైన్ టైం స్లాట్ టోకెన్లు ఇవ్వనున్నారు. అలాగే లాక్ డౌన్ తర్వాత శ్రీవారి పాదాల వరకు ఆర్టీసీ బస్సులు నడిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. శ్రీవారి పాదాల వద్దకు ఆర్టీసీ బస్సులు నడిపేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకుగానూ ఘాట్ రోడ్ లో మార్పులకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

తిరుమలకు అత్యంత ఎత్తైన ప్రాంతం శ్రీవారి పాదాలు. శ్రీవారి పాదాల వద్దకు వెళ్లాలంటే ఇప్పటివరకు ప్రైవేట్ వాహనాల్లో వెళ్లాల్సిందే. ఇక అలాంటి అవసరం లేకుండా టీటీడీ సమాలోచనలు చేస్తోంది. దానికి సంబంధించి ఆ మార్గంలో ఆర్టీసీ బస్సులను ప్రయోగాత్మకంగా నడిపారు. ఇప్పటికే ఆర్టీసీ సంస్థ ట్రయల్స్ నిర్వహించింది.

తిరుమలకు వచ్చిన ప్రతి భక్తుడు కూడా తిరుమల నుంచి మూడు కిలో మీటర్ల దూరంలో ఉన్న శ్రీవారి పాదాల వద్దకు చేరుకుని శ్రీవారిని దర్శించుకుంటారు. ఇది అత్యంత ఎత్తైన ప్రాంతం.. ఈ ప్రాంతానికి గతంలో ఎప్పుడు కూడా ఆర్టీసీ బస్సులు లేవు…ప్రైవేట్ వాహనాలే వచ్చేవి. ప్రైవేట్ వాహనాలు గానీ, స్వంత వాహనాల్లో భక్తులు ఇక్కడికి వచ్చి శ్రీవారి పాదాల సందర్శించి మొక్కులు చెల్లించి వెళ్లేవారు. 

తాజగా ఏపీఎస్ఆర్టీసీ ఇక్కడికి కూడా ఆర్టీసీ బస్సులను నడపాలనే ఆలోచనలో ఉంది. ఆర్టీసీ బస్సులన్ని కూడా కాస్త సైజ్ ను తగ్గించుకుని, రోడ్డు కూడా అనువుగా ఏర్పాటు చేయాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. అందుకు సంబంధించి టీటీడీ ఏర్పాట్లను పూర్తి చేసిన వెంటనే బస్సులు నడిపేందుకు ఆర్టీసీ సంస్థ సిద్ధమవుతుంది. 

Read Here>> శ్రీవారి పాదాల వరకు RTC బస్సులు