అన్నమయ్య భవనంలో టీటీడీ పాలకమండలి భేటీ.. ఈ అంశాలపై చర్చ
ఏఐ సాయంతో సామాన్య భక్తులకు వేగంగా దర్శనం, టీటీడీ ఉద్యోగులకు నేమ్ బ్యాడ్జ్, తదితర ఆంశాలపై చర్చిస్తున్నారు.

TTD
తిరుమల అన్నమయ్య భవనంలో టీటీడీ పాలకమండలి సమావేశమైంది. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడి ఆధ్యక్షతన ఈ సమావేశం జరుగుతోంది. 66 అజెండా ఆంశాలపై చర్చించి తీర్మానాలు చేయనుంది బోర్డు.
ఏఐ సాయంతో సామాన్య భక్తులకు వేగంగా దర్శనం, టీటీడీ ఉద్యోగులకు నేమ్ బ్యాడ్జ్, తదితర ఆంశాలపై చర్చిస్తున్నారు. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఏ మేరకు అమలు జరగాయనే దానిపై సమీక్ష కూడా నిర్వహిస్తారు. వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై కూడా చర్చ జరగనుంది.
గంట నుంచి 3 గంటల్లోనే శ్రీవారి దర్శనం పూర్తి అయ్యే ఏఐ సహకారంతో చర్యలు తీసుకోవడంపై చర్చిస్తున్నారు. తిరుమల విజన్-2047, టీటీడీ ఆస్తుల పరిరక్షణ, హోటళ్లలో ఆహార పదార్థాల నాణ్యత పెంపు, టీటీడీ ఆస్పత్రుల నిర్వహణ, వృథా ఖర్చుల నియంత్రణపై కూడా చర్చిస్తారు.
కాగా, కొన్ని వారాల ముందు 25 మంది సభ్యులతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టీటీడీ బోర్డును ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. చైర్మన్‌గా బీఆర్ నాయుడిని నియమిస్తూ ఆ సమయంలో ప్రభుత్వం జీవో జారీ చేసింది. కొత్త పాలక మండలిలో తెలంగాణ నుంచి ఐదుగురు, అలాగే, కర్ణాటక నుంచి ముగ్గురు, తమిళనాడు నుంచి ఇద్దరు ఉన్నారు. గుజరాత్, మహారాష్ట్రా నుంచి ఒక్కొక్కరి చొప్పున అవకాశం దక్కింది.
DK Aruna: అందుకే అల్లు అర్జున్‌పై రేవంత్ రెడ్డి ఈ విధంగా వ్యవహరిస్తున్నారు: డీకే అరుణ