DK Aruna: అందుకే అల్లు అర్జున్‌పై రేవంత్ రెడ్డి ఈ విధంగా వ్యవహరిస్తున్నారు: డీకే అరుణ

అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేయడం, అతని కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టడం, అతడి ఇంటి పైన దాడి చేయడం ఇవన్నీ కక్ష సాధింపు రాజకీయాలేనని అన్నారు.

DK Aruna: అందుకే అల్లు అర్జున్‌పై రేవంత్ రెడ్డి ఈ విధంగా వ్యవహరిస్తున్నారు: డీకే అరుణ

Updated On : December 24, 2024 / 10:32 AM IST

సినీ హీరో అల్లు అర్జున్ పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై బీజేపీ నాయకురాలు డీకే అరుణ స్పందించారు. 10 టీవీతో ఆమె ఇవాళ మాట్లాడుతూ.. “రేవతి మరణం బాధాకరం. ఆమె కొడుకు శ్రీ తేజ కోలుకోవాలని కోరుకుంటున్నాను” అని అన్నారు.

“రేవంత్ రెడ్డి తన రాజకీయాల కోసం అల్లు అర్జున్ పై ఈ విధంగా వ్యవహరిస్తున్నారు. సంధ్యా థియేటర్ సంఘటనను తన రాజకీయాలకు వాడుకోవడం సరైనది కాదు. ఇక్కడ సినిమా హీరోలా? రాజకీయ నాయకులా? అనేది పక్కన పెడితే రాజకీయాలు చేయడం సరైనది కాదు.

ముఖ్యమంత్రి కాకముందు రేవంత్ రెడ్డి బౌన్సర్ లేకుండా బయటికి వెళ్లేవారా? కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో శాంతిభద్రతలు గాడి తప్పాయి. అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేయడం, అతని కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టడం, అల్లు అర్జున్ ఇంటి పైన దాడి చేయడం ఇవన్నీ కక్ష సాధింపు రాజకీయాలే.

మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఆలోచన చేయాలి. అసెంబ్లీని చూసిన ఎవరికైనా అర్థమవుతుంది ఎంఐఎం, కాంగ్రెస్ ఒకటే. ఎంఐఎంతో ప్రశ్న అని అడిగించుకుని సీఎం రేవంత్ రెడ్డి సమాధానం ఇచ్చుకున్నట్టుగా అనిపిస్తుంది. అల్లు అర్జున్ పట్ల పోలీసులు వివరించిన తీరు సరైంది కాదు. రాష్ట్రంలో ప్రజా సమస్యలు పక్కదారి పట్టించేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరిస్తుంది” అని డీకే అరుణ చెప్పారు.

కాగా, అల్లు అర్జున్‌ను పోలీసులు ఇవాళ విచారిస్తారు. దీంతో హైదరాబాద్‌లోని అల్లు అర్జున్ ఇంటి ముందు భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఆయన ఇంటికి వచ్చి ఇరువైపులా రెండు బారికేడ్లను ఏర్పాటు చేశారు పోలీసులు. టాస్క్ ఫోర్స్ పోలీసులు, సివిల్ పోలీసులు, ట్రాఫిక్ పోలీసులతో కలిపి వందమందికి పైగా అల్లు అర్జున్ ఇంటివద్ద ఉన్నారు.

Ex Constable Assets: రూ.8 కోట్లు సంపాదించాక ఉద్యోగానికి రాజీనామా చేసిన లంచగొండి కానిస్టేబుల్