Tirumala: తిరుమల వెళ్లే భక్తులకోసం టీటీడీ కీలక నిర్ణయం.. త్వరలో కొండపై కొత్త బ్రాండెడ్ హోటళ్లు..

స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తులకు నాణ్యమైన ఆహారం అందించే క్రమంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.

Tirumala: తిరుమల వెళ్లే భక్తులకోసం టీటీడీ కీలక నిర్ణయం.. త్వరలో కొండపై కొత్త బ్రాండెడ్ హోటళ్లు..

TTD

Updated On : February 24, 2025 / 10:11 AM IST

Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు రోజుకు వేలాది మంది భక్తులు తిరుమల కొండపైకి వస్తుంటారు. తెలుగు రాష్ట్రాల నుంచేకాక.. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి.. ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి భక్తులు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు వస్తుంటారు. అయితే, శ్రీవారి భక్తులకు నాణ్యమైన ఆహారం అందించేందుకు టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సరికొత్త ప్రణాళికలను సిద్దం చేసింది.

Also Read: TTD: టీటీడీ అధికారులతో సమీక్షంటూ కేంద్ర ప్రభుత్వ అధికారి హల్‌చల్‌.. అసలేం జరిగిదంటే..?

స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తులకు నాణ్యమైన ఆహారం అందించే క్రమంలో ఇప్పటికే మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో అందించే ఆహారంలోనూ అత్యున్నత ప్రమాణాలు టీటీడీ పాటిస్తోంది. తిరుమలలో పది పెద్ద క్యాంటీన్లు, ఆరు జనతా క్యాంటీన్లు ఉన్నాయి. ఇందులో ఏపీ టూరిజానికి నారాయణగిరి, అన్నమయ్య భవనం, బాలాజీ రెస్టారెంట్లను కేటాయించారు. సన్నిధానంలోని పెద్ద క్యాంటీన్ ను ప్రైవేటు సంస్థకు కేటాయించారు. మిటిలిన పెద్ద క్యాంటీన్లలో అన్నపూర్ణ, హెచ్వీడీసీ భవనాలు జనతా క్యాంటీన్ లో రెండు భవనాలు వినియోగానికి అనువుగా లేవని వాటి మరమ్మతులపై టీటీడీ ఇంజనీరింగ్ శాఖ అధికారులు పరిశీలిస్తున్నారు.

 

పెద్దక్యాంటీన్లు, జనతా క్యాంటీన్లను పేరున్న బ్రాండెడ్ హోటళ్లకు కేటాయించేందుకు టీటీడీ నిర్ణయించింది. ఇందుకోసం త్వరలో టెండర్లు ఆహ్వానించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే లైసెన్సింగ్ విధివిధానాలు ఖరారు చేశారు.