SMS ద్వారా టీటీడీ ఆలయాల్లో దర్శనం టికెట్లు

కరోనా లాక్ డౌన్ కారణంగా సామాన్య భక్తులకు దర్శనాలు నిలిపివేసిన ఆలయాల్లో నేటి నుంచి దర్శనాలు కల్పిస్తున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో కూడా 80 రోజలు తర్వాత సామాన్య భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. టీటీడీ ఆధ్వర్యంలోని అన్ని ఆలయాల్లోనూ దర్శనాలు ప్రారంభమయ్యాయి. ఈ ఆలయాలను దర్శించుకునే భక్తులకు టీటీడీ ఆన్ లైన్ లో ఉచితంగా టికెట్లు అందచేస్తోంది.
భక్తులు http://tirupatibalaji.ap.gov.in వెబ్‌సైట్‌లో టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదా ఆయా ఆలయాల దగ్గర ఏర్పాటు చేసిన మెషీన్లలో టికెట్లు తీసుకోవచ్చుని తెలిపింది. ఇవి కాక భక్తులకు మరింత సౌకర్యవంతంగా ఉండేందుకు ఎస్ఎంఎస్ ద్వారా కూడా దర్శనం టికెట్లను అందచేస్తోంది.
భక్తులు పద్మావతి అమ్మవారి ఆలయంతో పాటు కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం, శ్రీ ప్రసన్నవెంకటేశ్వరస్వామి, గోవిందరాజస్వామి,కపిలేశ్వరస్వామి ఆలయాల్లో దర్సనం టికెట్లుకూడా పొందవచ్చు.
ఇందుకోసం ప్రతిఆలయానికి ఒక కోడ్ ను ఏర్పాటు చేసింది. జూన్ 8 నుంచి టికెట్ల జారీ ప్రారంభించగా భక్తులు టీటీడీ సూచించిన 9321033330 నెంబరుకు ఎస్ఎంఎస్ చేయాల్సి ఉంటుంది. మీరు వెళ్లాల్సిన దేవాలయం కోడ్ ను చెపుతూ టీటీడీ ఇచ్చిన ఫోన్ కు ఎస్సెమ్మెస్ పంపించాలి. ఆలయాలకు టీటీడీ ఇచ్చిన కోడ్స్ ఈ విధంగా ఉన్నాయి.
శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, తిరుచానూర్- SVP
శ్రీ గోవిందరాజస్వామి ఆలయం, తిరుపతి- SVG
శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయం, తిరుపతి- SVK
శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం, శ్రీనివాస మంగాపురం- SVS
శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం, అప్పలాయగుంట- SVA
ఉదాహరణకు భక్తులు 18వ తేదీ తన కుటుంబసభ్యులు 7 మందితో కలిసి తిరుచానూర్ పద్మావతి అమ్మవారిని దర్శించుకోవాలనుకుంటే వారు ముందు గుడి కోడ్- తేదీ-ఎంత మంది దర్శనానికి వచ్చేది…SVP 18-06-2020 7 అని 9321033330 నెంబరుకు ఎస్సెమ్మెస్ పంపించాలి. కాగా…ఎస్సెమ్మెస్ ద్వారా ఉచిత టికెట్లు ఇచ్చే సదుపాయం పైన చెప్పిన ఐదుదేవాలయాలకే అని టీటీడీ వివరించింది.