Thirumala Srivari Darshanam : శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. వచ్చే నెల దర్శనం టికెట్లు నేడు విడుదల

అంతేకాకుండా పరిమిత సంఖ్యలో మాత్రమే టికెట్లను రిలీజ్‌ చేస్తుంది. అయితే ఫిబ్రవరి నెల నుంచి శ్రీవారి దర్శన టికెట్లను పెంచుతారనే ప్రచారం జరిగింది.

Thirumala Srivari Darshanam : శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. వచ్చే నెల దర్శనం టికెట్లు నేడు విడుదల

Tirumala (1)

Updated On : January 28, 2022 / 7:47 AM IST

Thirumala Srivari Darshanam tickets : తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఫిబ్రవరి నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి దర్శన టికెట్లను ఇవాళ విడుదల చేయనుంది. ఉదయం 9 గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను ఆన్‌లైన్‌లో ఉంచనుంది. అలాగే రేపు ఉదయం 9 గంటలకు టైమ్ స్లాట్ సర్వదర్శన టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. కరోనా నేపథ్యంలో గత కొన్ని నెలలుగా టీటీడీ.. శ్రీవారి దర్శన టికెట్లను ఆన్‌లైన్‌లోనే విడుదల చేస్తోంది.

అంతేకాకుండా పరిమిత సంఖ్యలో మాత్రమే టికెట్లను రిలీజ్‌ చేస్తుంది. అయితే ఫిబ్రవరి నెల నుంచి శ్రీవారి దర్శన టికెట్లను పెంచుతారనే ప్రచారం జరిగింది. కానీ ప్రస్తుతం కరోనా మరోసారి వేగంగా వ్యాప్తి చెందడం, కేసులు అధికంగా నమోదు కావడంతో.. ఈ నెల కూడా పరిమిత సంఖ్యలోనే టికెట్లను విడుదల చేయాలని టీటీడీ నిర్ణయించింది. భక్తులు టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌లలో మాత్రమే టికెట్లు బుక్‌ చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది.

TATA Air India : నేటి నుంచి టాటా ఎయిరిండియా సర్వీసులు

ఇటు శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు కచ్చితంగా కోవిడ్ నిబంధనలు పాటించాల్సిందేనని ఇప్పటికే సూచించింది. దర్శనానికి వచ్చే భక్తులు కోవిడ్ రెండు డోసుల వ్యాక్సిన్ సర్టిఫికేట్ లేదా 48 గంటల ముందు చేసుకున్న కోవిడ్ టెస్ట్ సర్టిఫికేట్ తప్పనిసరిగా అధికారులకు చూపించాలి. కోవిడ్ వ్యాక్సినేషన్‌ సర్టిఫికేట్‌ లేదా ఆర్టీపీసీఆర్‌ పరీక్ష నెగిటివ్‌ సర్టిఫికెట్‌ను ఉన్నవారిని మాత్రమే అలిపిరి చెక్ పాయింట్ నుంచి తిరుమలకు అనుమతిస్తున్నారు.