Road Accident : కేరళలో రోడ్డు ప్రమాదం..ఏపీకి చెందిన ఇద్దరు అయ్యప్ప భక్తులు మృతి

కేరళలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏపీకి చెందిన ఇద్దరు అయ్యప్ప భక్తులు మృతి చెందారు. పేరువంతానికి సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.

Road Accident : కేరళలో రోడ్డు ప్రమాదం..ఏపీకి చెందిన ఇద్దరు అయ్యప్ప భక్తులు మృతి

Road Accident

Updated On : December 9, 2021 / 3:26 PM IST

Two killed in road accident : కేరళలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏపీకి చెందిన ఇద్దరు అయ్యప్ప భక్తులు మృతి చెందారు. పేరువంతానికి సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఏపీకి చెందిన వాహనం బోల్తా పడింది. ఇద్దరు అయ్యప్ప భక్తులు మృతి చెందారు. మృతులు కర్నూలుకు చెందిన వారుగా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.

పోలీసుల కథనం ప్రకారం..కర్నూలు నగరంలోని బుధవారపేటకు చెందిన 11 అయ్యప్ప భక్తులు టెంపోలో బుధవారం ఉదయం 8.30 గంటలకు శబరిమల బయలుదేరారు. గురువారం ఉదయం 9.30 గంటలకు శబరిమలకు 60 కిలో మీటర్ల దూరంలో పేరువంతానికి సమీపంలో టెంపోను నిలిపి టీ తాగు తుండగా వెనుక నుంచి ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో ఇద్దరు మృతి చెందారు.

Rajnath Singh’s Statement : ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంపై పార్లమెంట్ లో రాజ్ నాథ్ సింగ్ ప్రకటన

మిగిలిన 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చి, క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. ఈ విషయాన్ని కేరళ పోలీసులు కర్నూలు పోలీసులకు తెలియజేయడంతో ఈ ప్రమాద ఘటన వెలుగులోకి వచ్చింది. మృతులు కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.