Delta Plus AY.4.2 Variant: తెలంగాణలో రెండు, ఏపీలో 17 డెల్టా ప్లస్ కేసులు.. బీ అలర్ట్!!

డెల్టా వేరియంట్ ఏవై.4.2 సాధారణంగా డెల్టా వేరియంట్ కంటే ప్రమాదకరం. తెలంగాణలోని హైదరాబాద్ తో పాటు, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఏడుగురిలోనూ ఈ పాజిటివ్ లక్షణాలు కనిపించాయి.

Delta Plus AY.4.2 Variant: తెలంగాణలో రెండు, ఏపీలో 17 డెల్టా ప్లస్ కేసులు.. బీ అలర్ట్!!

Delta Plus

Updated On : October 29, 2021 / 12:37 PM IST

Delta Plus: డెల్టా వేరియంట్ AY.4.2 సాధారణంగా డెల్టా వేరియంట్ కంటే ప్రమాదకరం. తెలంగాణలోని హైదరాబాద్ తో పాటు, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఏడుగురిలోనూ ఈ పాజిటివ్ లక్షణాలు కనిపించాయి. యూరప్ లో తొలి సారి కనిపించిన ఏవై 4.2 యూకేలో కూడా కనపడింది. వేరియంట్ ఎలా వచ్చిందనే దానిపై యూకేలో ఇంకా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి.

ఈ వేరియంట్ కారణంగా వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో పాటు చావు రేటు కూడా వేగంగానే ఉంటుంది. మానవ శరీరంలో దీని పునరుత్పత్తి ఫాస్ట్ గా జరుగుతుంది. SARS-CoV2 వేరియంట్ తర్వాతి స్థానంలో ఉన్నదిదే. అక్టోబర్ 22న యూకే హెల్త్ సెక్యూరిటీ కౌన్సిల్ రిపోర్ట్ ప్రకారం.. ఇండియాలో 22 డెల్టా వేరియంట్ కొవిడ్ పాజిటివ్ కేసులు ఉన్నట్లు వెల్లడించింది.

ఆంధ్రప్రదేశ్ లో పదిహేడు కేసులు ఉండగా.. కేరళలో నాలుగు, తెలంగాణలో రెండు, కర్ణాటకలో రెండు, మహారాష్ట్ర.. కశ్మీర్ లో ఒకొక్కటి చొప్పున నమోదయ్యాయి.

……………………………….. : పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు బ్రేక్

కొవిడ్ లక్షణాలు ఉన్న వారెవరూ ఇతర ప్రాంతాలకు వెళ్లకూడదని సీనియర్ పబ్లిక్ హెల్త్ అఫీషియల్స్ అంటున్నారు. ట్రావెల్ ఆంక్షలు లేనప్పటికీ స్వతహాగా వేరియంట్ల వ్యాప్తి పెరగకుండా ఉండేంుదకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. డిసెంబర్ వరకూ వ్యాక్సినేషన్ తీసుకుంటూ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు.