Elephants Attack : కుప్పంలో ఏనుగుల దాడిలో ఒకే రోజు ఇద్దరు మృతి
గత రాత్రి రెండు ప్రాణాంతక ఏనుగులు చిత్తూరు జిల్లాలోకి ప్రవేశించాయి. వచ్చీ రాగానే కుప్పంలో ఓ మహిళను ఏనుగులు హతమార్చాయి.

Elephants Attack
Elephants Attack : చిత్తూరు జిల్లా కుప్పంలో దారుణం జరిగింది. ఏనుగుల దాడిలో ఇద్దరు మృతి చెందారు. నలుగురిపై ఏనుగులు దాడి చేశాయి. ఈ దాడిలో మహిళ, పురుషుడు మృతి చెందారు. ముగ్గురు మహిళలతోపాటు పురుషుడిపై రెండు ఏనుగులు దాడి చేశాయి. దీంతో మహిళ, పురుషుడు మృతి చెందగా, మరో ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలు అయ్యాయి. మృతులు కుప్పం మండలం పర్తిచేను గ్రామానికి చెందిన ఉష (42), సప్పాని కుంట గ్రామానికి చెందిన శివలింగంగా గుర్తించారు.
మృతురాలు ఉష బెంగళూరులో కూలి పనులు చేసుకుంటున్నారు. ఈ తెల్లవారుజామున బెంగళూరుకు వెళ్లేందుకు రైల్వే స్టేషన్ కు వెళ్తోన్న ముగ్గురు మహిళలపై మొదటగా ఏనుగులు దాడి చేశాయి. ఈ దాడిలో ఉష చనిపోగా, మరో ఇద్దరు మహిళలకు గాయాలు అయ్యాయి. ఘటనా స్థలానికి అటవీ అధికారులు… రెండు ఏనుగులను తిరిగి అడవిలోకి పంపేందుకు యత్నించారు. కుప్పంలో ఏనుగుల దాడిలో మరో వ్యక్తి మృతి చెందారు.
Elephant Kills: హడలెత్తిస్తోన్న ఏనుగు.. 12రోజుల్లో 16 మందిని చంపేసింది..! భయంతో వణికిపోతున్న ప్రజలు
కుప్పం మండలం మల్లనూరు పంచాయతీ సప్పాని కుంట గ్రామానికి చెందిన శివలింగంపై ఏనుగులు దాడి చేశాయి. ఏనుగుల దాడిలో శివలింగం అనే వ్యక్తి మృతి చెందాడు. రెండు ఏనుగులు ఒకే రోజు ఇద్దరు ప్రాణాలు తీశాయి. దీంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. తమిళనాడు కృష్ణగిరి చెరువు వద్ద నలుగురిని చంపిన రెండు ఏనుగులే ఈ దాడికి పాల్పడినట్లు గుర్తించారు.
గత రాత్రి రెండు ప్రాణాంతక ఏనుగులు చిత్తూరు జిల్లాలోకి ప్రవేశించాయి. వచ్చీ రాగానే కుప్పంలో ఓ మహిళను ఏనుగులు హతమార్చాయి. కాగా, మనుషుల ప్రాణాలు తీస్తున్న రెండు ఏనుగులను అడవిలోకి కాకుండా చిత్తూరు జిల్లా వైపు పంపిన తమిళనాడు అటవీ సిబ్బందిపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.