Lorry Accident : పోలీసులపై దూసుకెళ్లిన లారీ.. డ్రైవర్, క్లీనర్‌ పరార్

తూర్పుగోదావరి జిల్లాలో లారీ బీభత్సం సృష్టించింది. సామర్లకోట ఉండూరు బ్రిడ్జి వద్ద పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్న పోలీసులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో హెడ్‌ కానిస్టేబుల్ సత్యనారాయణ, హోంగార్డు ఎన్‌ఎస్‌ రెడ్డి అక్కడికక్కడే మృతిచెందారు.

Lorry Accident : పోలీసులపై దూసుకెళ్లిన లారీ.. డ్రైవర్, క్లీనర్‌ పరార్

Two Police Killed Lorry Ramps Patrolling Polices In East Godavari District

Updated On : May 14, 2021 / 7:57 AM IST

Lorry hit patrolling Police : తూర్పుగోదావరి జిల్లాలో లారీ బీభత్సం సృష్టించింది. సామర్లకోట ఉండూరు బ్రిడ్జి వద్ద పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్న పోలీసులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో హెడ్‌ కానిస్టేబుల్ సత్యనారాయణ, హోంగార్డు ఎన్‌ఎస్‌ రెడ్డి అక్కడికక్కడే మృతిచెందారు.

మృతిచెందిన కానిస్టేబుల్స్ కాకినాడ తిమ్మాపురం పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నారు. విజయవాడ నుంచి వస్తున్న వ్యాక్సిన్ వాహనం కోసం ఎస్కార్ట్‌గా ఉన్నారు.

అర్థరాత్రి 2 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. ప్రమాదం అనంతరం లారీ డ్రైవర్, క్లీనర్‌ పరారయ్యారు. ఘటన స్థలానికి చేరుకున్న కాకినాడ డీఎస్పీ భీమారావు, పోలీసు అధికారులు ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు.

లారి కింద చిక్కుకున్న మృతదేహాలను బయటకు తీసి, పోస్టుమార్టం కోసం కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విజయవాడ నుంచి వచ్చే కోవిడ్ వ్యాక్సిన్‌ వాహనానికి ఎస్కార్ట్ విధుల కోసం ఉండూరు వంతెన వద్ద వేచి ఉండగా ఈ ప్రమాదం జరిగింది. లారీ డ్రైవర్ నిద్ర మత్తు వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.