Andrapradesh Debts : ఆంధ్రప్రదేశ్‌ అప్పులు రూ. 3,60,333.4 కోట్లు : వెల్లడించిన కేంద్ర ఆర్థిక శాఖ

ఆంధ్రప్రదేశ్‌ అప్పుల వివరాలను  వెల్లడించింది కేంద్ర ప్రభుత్వం.

Andrapradesh Debts : ఆంధ్రప్రదేశ్‌ అప్పులు  రూ. 3,60,333.4 కోట్లు :  వెల్లడించిన కేంద్ర ఆర్థిక శాఖ

Andrapradesh Debts

Updated On : December 20, 2022 / 9:49 AM IST

Andrapradesh Debts : ఆంధ్రప్రదేశ్‌ అప్పుల వివరాలను  వెల్లడించింది కేంద్ర ప్రభుత్వం. ప్రభుత్వం ప్రతిఏటా అప్పులు పెంచుకుంటూ పోతోందని తెలిపింది. పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతున్న క్రమంలో లోక్‌సభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది. బడ్జెట్ లెక్కల ప్రకారం 2018లో ఆంధ్రప్రదేశ్ అప్పు రూ. 2,29,333.8 కోట్లు ఉండగా ప్రస్తుతం ఆ అప్పు మరింత భారీగా పెరిగి రూ. 3,60,333.4 కోట్లకు చేరిందని తెలిపింది కేంద్ర ఆర్ధిక శాఖ. ఏపీలో అభివృద్ధి అనేది లేకపోయినా అప్పుల భారం మాత్రం పెరుగుతోందని దీనికి 2018లో రూ. 2,29,333.8 కోట్లుగా ఉన్న ఆ అప్పు రూ. 3,60,333.4 కోట్లకు పెరగటం స్పష్టంగా కనిపిస్తోందని వెల్లడించింది.

అప్పుల శాతం కూడా క్రమేణా పెరుగుతోందని వివరాలు బయటపెట్టిన కేంద్ర ఆర్ధిక శాఖ.. 2017-18లో గతంతో పోలిస్తే -9.8 శాతం అప్పులు తగ్గుదల నమోదు అయిందని.. అయితే 2020-21నాటికి 17.1 శాతం పెరుగుదల ఉందని స్పష్టం చేసింది ఆర్ధిక శాఖ.రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తిలోనూ గత మూడేళ్లుగా అప్పుల శాతం పెరుగుతూ పోతోందని..2014లో రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తిలో అప్పుల శాతం 42.3% ఉండగా ఆ తరువాత భారీగా తగ్గుదల ఉందని తెలిపింది. 2015 లో రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తిలో 23.3 శాతం అప్పులు ఉండగా 2021 నాటికి రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తిలో 36.5 శాతం అప్పులు నమోదయ్యాయని వెల్లడించింది.