విశాఖ – విజయవాడ మధ్య కొత్తగా రెండు విమాన సర్వీసులు ప్రారంభం.. ప్రయాణ సమయాలు ఇవే..

విశాఖపట్టణం - విజయవాడ మధ్య కొత్తగా రెండు విమాన సర్వీసులు ప్రయాణీకులకు అందుబాటులోకి వచ్చాయి. ఈ కొత్త విమానాలతో కలిపి

విశాఖ – విజయవాడ మధ్య కొత్తగా రెండు విమాన సర్వీసులు ప్రారంభం.. ప్రయాణ సమయాలు ఇవే..

Union Minister Rammohan Naidu

Updated On : October 27, 2024 / 12:39 PM IST

Two New Flights Services Between Visakhapatnam and Vijayawada : విశాఖపట్టణం – విజయవాడ మధ్య కొత్తగా రెండు విమాన సర్వీసులు ప్రయాణీకులకు అందుబాటులోకి వచ్చాయి. ఈ కొత్త విమానాలతో కలిపి విశాఖ – విజయవాడ మధ్య తిరిగే సర్వీసుల సంఖ్య మూడుకు చేరనుంది. అయితే, ఆదివారం విశాఖ విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ విమాన సర్వీసును కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విశాఖ – విజయవాడ మధ్య ప్లైట్ కనెక్టివిటీ పెంచాలని చాలా మంది కోరారు. వారి కోరిక మేరకు ఈ మార్గంలో రెండు సర్వీసులు ప్రారంభించాం. ఒకేసారి రెండు నగరాల మధ్య రెండు ప్లైట్లు ప్రారంభం కావడం బహుశా ఇదే మొదటి సారి అని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.

Also Read: Miheeka Daggubati : బీచ్ లో ఎంజాయ్ చేస్తున్న రానా భార్య.. వీడియో చూశారా..?

ప్రయాణ సమయాలు ఇలా..
◊  విశాఖ పట్టణం, విజయవాడ మధ్య ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్, ఇండిగో సర్వీసులు ప్రయాణించనున్నాయి.
◊  ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ సర్వీసు ఉదయం 9.35 గంటలకు విశాఖలో బయలుదేరి 10.35 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుంటుంది. తిరిగి రాత్రి 7.55 గంటలకు విజయవాడలో బయలుదేరి రాత్రి 9గంటలకు విశాఖ పట్టణం చేరుతుంది.
◊  ఇండిగో సర్వీసు రాత్రి 7.15 గంటలకు విజయవాడలో బయలుదేరి రాత్రి 8.20 గంటలకు విశాఖ చేరుకుంటుంది. అదే సర్వీసు తిరిగి రాత్రి 8.45కు విశాఖలో బయలుదేరి 9.50 గంటలకు విజయవాడ చేరుతుంది.