రేపటి నుంచి ఏపీకి ప్రయాణం సులువు

  • Published By: murthy ,Published On : August 1, 2020 / 11:01 AM IST
రేపటి నుంచి ఏపీకి ప్రయాణం సులువు

Updated On : August 1, 2020 / 12:37 PM IST

దేశవ్యాప్తంగా అన్ లాక్ సడలింపులు అమలవుతున్నా రెండు రాష్ట్రాల మధ్య రాక పోకల విషయంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే పాసుల ద్వారానే ప్రజలు రవాణా చేసే పరిస్ధితి ఇన్నాళ్లు నెలకొంది.  దీంతో తెలంగాణ నుంచి ఏపీ కి ప్రయాణం చేసేవారు పలు ఇబ్బందులు ఎదుర్కోన్నారు. దేశ వ్యాప్తంగా రాత్రిపూట కర్ఫ్యూను కూడా కేంద్రం ఎత్తి వేస్తూ ఆన్‌లాక్‌ 3.0 సడలింపులని ఇటీవల  ప్రకటించింది.



కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అన్‌లాక్‌ 3 నిబంధనల ప్రకారం రాష్ట్రాల సరిహద్దు చెక్ పోస్టుల్లో  ఏపీ ప్రభుత్వం సడలింపులు చేసింది. ఈ సందర్భంగా ట్రాన్స్ పోర్ట్‌ అండ్‌ ఆర్‌ అండ్‌ బీ ప్రిన్సిపాల్ సెక్రటరీ కృష్ణబాబు మాట్లాడుతూ, ‘ఏపీకి వచ్చే వారు స్పందన వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. దరఖాస్తు నమోదైన వెంటనే ఆటోమేటిక్‌గా ఈ- పాస్  వారు  ఇచ్చిన రిజిష్టర్ మొబైల్ కు, ఈ మెయిల్‌కి వస్తుంది. దానిని చెక్ పోస్టులో నమోదు చేయించుకుని ఎవరైనా రాష్ట్రంలోకి రావచ్చని ఆయన వివరించారు.



ఈ నమోదు, వచ్చేవారి సంఖ్యను గుర్తించేందుకు మాత్రమే అని…. ఆ తర్వాత ఆరోగ్య కార్యకర్తలు వారి ఆరోగ్యంపై దృష్టి ఉంచుతారని చెప్పారు. ఆగస్టు 2 ఆదివారం నుంచి ఈ విధానం అమలులోకి వస్తుంది’ అని  ఆయన తెలిపారు.