పిల్లలు ఇప్పుడు సెల్ ఫోన్‌ను అధికంగా వినియోగిస్తున్నారు: హోం మంత్రి అనిత కీలక సూచనలు

పిల్లలు గంజాయికి విపరీతంగా బానిసలు అవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

పిల్లలు ఇప్పుడు సెల్ ఫోన్‌ను అధికంగా వినియోగిస్తున్నారు: హోం మంత్రి అనిత కీలక సూచనలు

Home Minister Vangalapudi Anitha

Updated On : December 7, 2024 / 3:40 PM IST

ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లాలోని ఎస్ రాయవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తల్లిదండ్రుల-ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో హోం మంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ… “పిల్లలు ఇప్పుడు సెల్ ఫోన్‌ను అధికంగా వినియోగిస్తున్నారు. పిల్లలకు చదువులు చెప్పడం ఒక్కటే టీచర్స్ బాధ్యత కాకుండా వారి వ్యవహర శైలిని కూడా పరిశీలించాలి. పిల్లలు గంజాయికి విపరీతంగా బానిసలు అవుతున్నారు. పిల్లలను తల్లిదండ్రులు-ఉపాధ్యాయులు నిరంతరం పరిశీలించాలి.

పిల్లలు కూడా గంజాయి మత్తులో విచ్చక్షణా రహితంగా వ్యవహరిస్తారు. మన పిల్లలను మనమే జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తే, పిల్లలకు బాధ్యత ఉంటుంది. ఉపాధ్యాయులు విద్యార్థుల నైతికవిలువలపై దృష్టి సారించండి. రానున్న కాలంలో రాయవరం పాఠశాలను మరింత అభివృద్ధి చేస్తాం. హైస్కూల్ గ్రౌండ్ ను కూడ ఆధునికీకరిస్తాం. ధర్మవరం-ఎస్ రాయవరం రోడ్డును కూడా త్వరలోనే వేయనున్నాం” అని అనిత చెప్పారు.

ఆరు నెలల్లో ప్రభుత్వం విద్యాశాఖలో ఎన్నో మార్పులు తీసుకువచ్చందని తెలిపారు. విద్యాశాఖ మంత్రి లోకేశ్ ప్రణాళికతో విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నారని చెప్పారు. పిల్లల ఆరోగ్యంపై కూడా విద్యాశాఖ దృష్టి పెట్టిందని తెలిపారు. మగ, ఆడ పిల్లలు అయినా అందరికీ తొలి గురువు అమ్మేనని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో నిపుణులైన ఉపాధ్యాయులు ఉంటారని తెలిపారు. తల్లిదండ్రులు పిల్లలను క్రమశిక్షణతో పెంచాలని చెప్పారు.

పదో తరగతి విద్యార్థుల వేధింపులు తాళలేక ఆరో తరగతి బాలుడి ఆత్మహత్యాయత్నం