తిరుపతి ఎంపీ స్థానంలో ఓటమిపై బీజేపీ అభ్యర్థి వరప్రసాదరావు భావోద్వేగం

తిరుపతి లోక్‌స‌భ‌ స్థానంలో ఓటమిపై బీజేపీ అభ్యర్థి వెలగపల్లి వరప్రసాదరావు భావోద్వేగానికి లోనయ్యారు.

తిరుపతి ఎంపీ స్థానంలో ఓటమిపై బీజేపీ అభ్యర్థి వరప్రసాదరావు భావోద్వేగం

Varaprasad Rao Velagapalli emotion on his defeat

Varaprasad Rao Velagapalli Emotion: తిరుపతి లోక్‌స‌భ‌ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన వెలగపల్లి వరప్రసాదరావు శుక్రవారం మీడియా ముందుకు వచ్చారు. స్వల్ప తేడాతో ఓడిపోయానంటూ భావోద్వేగానికి గురయ్యారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమని, చాలా తక్కువ మెజారిటీతో ఓడిపోవడం బాధ కలగిస్తోందన్నారు. తిరుపతిలో గత 15 సంవత్సరాల్లో పలు అభివృద్ధి పనులు చేశానని చెప్పుకొచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులపై విమర్శలు చేశారు.

”గతంలో జగన్, విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డికి సలహాలు ఇచ్చినా పెడచెవిన పెట్టారు. గడచిన 5 సంవత్సరాలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు. నియంతృత్వం, అరాచక పాలన నుంచి కాపాడుకోవడానికి నేను బీజేపీలో చేరాను. దీనిని అంతం చేయడానికి ముందుకు వచ్చిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ని అభినందిస్తున్నాను. ఏ ఒక్క సామాజిక వర్గానికి కూడా మోదీ, బీజేపీ అన్యాయం చేయలేదు. ఏపీకి ప్రత్యేక హోదాను ఎన్డీఏ ప్రభుత్వం పరిశీలిస్తుంద”ని వరప్రసాదరావు అన్నారు.

Also Read: ఆ వాలంటీర్‌ కుటుంబానికి అండగా నిలిచిన కొడాలి నాని.. రూ.5 లక్షల సాయం

కాగా, తిరుపతి లోక్‌స‌భ‌ స్థానం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మద్దిల గుర్తుమూర్తి విజయం సాధించారు. వరప్రసాదరావుపై 14569 ఓట్ల మెజారిటీతో ఆయన గెలుపొందారు. గుర్తుమూర్తికి 632228 ఓట్లు, వరప్రసాదరావుకు 617659 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ తరపున పోటీ చేసిన చింతా మోహన్ 65523 ఓట్లు సాధించారు. లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి బరిలోకి దిగిన మాజీ ఐపీఎస్ అధికారి విజయకుమార్ 4302 ఓట్లు దక్కించుకున్నారు.