Varla Ramaiah: మీ తాత రెండు పెళ్లిళ్లు చేసుకోలేదా?.. జగన్ మాటలు ఎంత ఘోరంగా ఉన్నాయంటే?: వర్ల రామయ్య

పవన్ పై జగన్ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని చెప్పారు.

Varla Ramaiah: మీ తాత రెండు పెళ్లిళ్లు చేసుకోలేదా?.. జగన్ మాటలు ఎంత ఘోరంగా ఉన్నాయంటే?: వర్ల రామయ్య

Varlaramaiah

Updated On : July 23, 2023 / 3:24 PM IST

Varla Ramaiah- YS Jagan: జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పెళ్లిళ్ల మీద పెళ్లిళ్లు చేసుకుంటున్నారని, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Andhra Pradesh) మహిళలను కించపర్చేలా మాట్లాడతారని ఏపీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేత వర్ల రామయ్య కౌంటర్ ఇచ్చారు. టీడీపీ నేత నారా లోకేశ్ పై జగన్ చేసిన వ్యాఖ్యలకు కూడా వర్ల రామయ్య సమాధానం ఇచ్చారు.

అమరావతిలో వర్ల రామయ్య మీడియాతో మాట్లాడుతూ… జగన్ తాత రాజారెడ్డికి రెండు పెళ్లిళ్లు జరిగాయని సమాజం మాట్లాడుకుంటుందని, ఇది నిజం కాదా అని వర్ల రామయ్య ప్రశ్నించారు. పవన్ గురించి జగన్ చేస్తున్న కామెంట్స్ సభ్య సమాజంలోని మహిళలు తలలు దించుకునేలా ఉన్నాయని చెప్పారు.

పవన్ కల్యాణ్ చట్టబద్ధంగా విడాకులిచ్చారని వర్ల రామయ్య అన్నారు. పవన్ పై జగన్ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని చెప్పారు. బాలకృష్ణను దౌర్భాగ్యపు బావమరిది అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు సరికాదని అన్నారు. సినీనటుల మధ్య సరదాగా జరిగిన సంభాషణకు సంబంధించిన వ్యాఖ్యలను చూపిస్తూ జగన్ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఏంటని నిలదీశారు.

తమ పార్టీ నేత నారా లోకేశ్ స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో పీజీ చదివారని వర్ల రామయ్య అన్నారు. మరి జగన్ డిగ్రీ ఎక్కడ చదివారో కాస్త చెబుతారా అని ఎద్దేవా చేశారు. జగన్ బెంగుళూరు వదిలి హైదరాబాద్ రావద్దని వైఎస్సార్ ఎందుకు అనేవారని నిలదీశారు.

Daggubati Purandeswari : రాయలసీమ డిక్లరేషన్ కు బీజేపీ కట్టుబడి ఉంది : దగ్గుబాటి పురంధేశ్వరి