టీడీపీలో చేరిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు

రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి శనివారం తెలుగు దేశం పార్టీలో చేరారు.

టీడీపీలో చేరిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు

vemireddy prabhakar reddy joins telugu desam party

Updated On : March 2, 2024 / 2:02 PM IST

Vemireddy Prabhakar Reddy: రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి శనివారం తెలుగు దేశం పార్టీలో చేరారు. టీడీపీ కండువాతో ఆయనను చంద్రబాబు నాయుడు తమ పార్టీలోకి ఆహ్వానించారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సతీమణి ప్రశాంతి రెడ్ది, నెల్లూరు నగర డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ కూడా టీడీపీలో చేరారు. నెల్లూరులోని పీవీఆర్ కన్వెక్షన్ సెంటర్ లో జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Also Read: మంగళగిరి వైసీపీ సమన్వయకర్తగా లావణ్య.. ఎమ్మెల్యే ఆర్కే కీలక వ్యాఖ్యలు

ఈ సందర్భంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్ది మాట్లాడుతూ.. దేవుడి ఆశీస్సులతో నా పరిధి మేరకు సేవ చేసాను.. పరిధి మేరకు సేవ చేసేందుకే రాజకీయాల వైపు అడుగు వేశాను. దైవ నిర్ణయంతో టీడీపీ వైపు అడుగులు వేశాను. నాపై నమ్మకం ఉంచి నాతో కలసి వచ్చిన వారికి తోడుగా వుంటాను. బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ నెల్లూరు విచ్చేసిన చంద్రబాబుకు ధన్యవాదాలని అన్నారు.