మళ్లీ మళ్లీ చెప్తున్నా మంగళగిరిలో వైసీపీ జెండా ఎగరేస్తాం: ఎమ్మెల్యే ఆర్కే

మళ్లీ మళ్లీ చెప్తున్నా మంగళగిరిలో వైసీపీ పార్టీ జెండా ఎగరవేస్తాం. రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబం నుంచి వచ్చిన లావణ్య గెలుపు ఖాయం.

మళ్లీ మళ్లీ చెప్తున్నా మంగళగిరిలో వైసీపీ జెండా ఎగరేస్తాం: ఎమ్మెల్యే ఆర్కే

alla ramakrishna reddy comments on murugudu lavanya

Alla Ramakrishna Reddy: గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా గంజి చిరంజీవి స్థానంలో మురుగుడు లావణ్యను సీఎం జగన్ నియమించారు. ఈ మార్పుపై మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి స్పందించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గతంలో చెప్పిన విధంగానే మంగళగిరి సీటు గెలిపించి జగనన్నకు కానుక ఇస్తామని ఆర్కే పునరుద్ఘాటించారు. తెలుగుదేశం పార్టీకి మరోసారి భంగపాటు తప్పదని అన్నారు.

”మళ్లీ మళ్లీ చెప్తున్నా మంగళగిరిలో వైసీపీ పార్టీ జెండా ఎగరవేస్తాం. రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబం నుంచి వచ్చిన లావణ్య గెలుపు ఖాయం. 2024 ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గంలో నాన్ లోకల్, బీసీ అభ్యర్థుల మధ్య పోటీ ఉంటుంద”ని ఎమ్మెల్యే ఆర్కే వ్యాఖ్యానించారు. కాగా, మంగళగిరి నుంచి టీడీపీ తరపున ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. నారా లోకేశ్‌నే ఎమ్మెల్యే ఆర్కే నాన్ లోకల్ అభ్యర్థిగా పేర్కొన్నారు.

Also Read: వైసీపీలోకి ముద్రగడ..? పిఠాపురంలో శరవేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలు

ఎవరీ లావణ్య?
మురుగుడు లావణ్యకు పుట్టింటి నుంచి, మెట్టింటి నుంచి కూడా రాజకీయ నేపథ్యం ఉంది. లావణ్య తల్లి కాండ్రు కమల 2009 నుంచి 2014 వరకు మంగళగిరి ఎమ్మెల్యేగా ఉన్నారు. 2004 నుంచి 2009 వరకు మంగళగిరి మున్సిపల్ చైర్‌ప‌ర్స‌న్‌గానూ పనిచేశారు. లావణ్య మామ మురుగుడు హనుమంతరావు ప్రస్తుతం ఎమ్మెల్సీగా, ఎథిక్స్ కమిటీ చైర్మ‌న్‌గా ఉన్నారు. అంతకుముందు రెండుసార్లు ఎమ్మెల్యేగా ఆయన ఎన్నికయ్యారు. 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి క్యాబినెట్‌లోనూ చోటు దక్కించుకున్నారు.

Also Read: వివేకా కూతురు సునీత ఇవాళ ముసుగు తీసేశారు.. అసలు విషయం తేలింది: సజ్జల