Vijayawada Crime: యువతిపై ఆటోడ్రైవర్ అత్యాచారయత్నం.. నిందితుడి అరెస్టు

బెజవాడలో యువతిపై ఆటోడ్రైవర్ అత్యాచార యత్నం చేసిన కేసులో పోలీసులు వెంటనే స్పందించి, నిందితుడిని త్వరగా అరెస్టు చేసినట్లు సీపీ కాంతిరాణా టాటా చెప్పారు.

Vijayawada Crime: యువతిపై ఆటోడ్రైవర్ అత్యాచారయత్నం.. నిందితుడి అరెస్టు

Vijayawada Crime

Updated On : May 2, 2022 / 2:44 PM IST

Vijayawada Crime: బెజవాడలో యువతిపై ఆటోడ్రైవర్ అత్యాచార యత్నం చేసిన కేసులో పోలీసులు వెంటనే స్పందించి, నిందితుడిని త్వరగా అరెస్టు చేసినట్లు సీపీ కాంతిరాణా టాటా చెప్పారు. ఈ ఘటన సోమవారం తెల్లవారుజామున జరిగిందని సీపీ చెప్పారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సీపీ కాంతిరాణా మీడియాకు వివరించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నూజివీడుకు చెందిన బాలిక తన స్నేహితుడు ఆంజనేయులును కలిసేందుకు ఆదివారం రాత్రి పది గంటలకు విజయవాడ చేరుకుంది.

Vijayawada Crime: విజయవాడలో బాలికపై ఆటోడ్రైవర్ అత్యాచారయత్నం

అక్కడ తన స్నేహితుడు బస చేసిన హోటల్ అడ్రస్ కోసం ఆ యువతి ఆటోడ్రైవర్ సాయం కోరింది. హోటల్ అడ్రస్ చూపిస్తానంటూ బాలికను నున్న ప్రాంతంలోని పొలాల్లోకి తీసుకెళ్లాడు. అక్కడ అత్యాచార యత్నం చేశాడు. దీంతో యువతి ఆటోడ్రైవర్‌ను ప్రతిఘటించి, అక్కడ్నుంచి తప్పించుకుంది. వెంటనే 100కు డయల్ చేసింది. కాల్ అందుకున్న ఐదు నిమిషాల్లోనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాలికను రక్షించారు. తర్వాత మూడు బృందాలతో గాలించి ఆటోడ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. బాలికను తల్లిదండ్రులకు అప్పగించారు. ఆటోడ్రైవర్‌ను ఖాదర్‌గా గుర్తించారు.

Vijayawada : ఏపీలో మహిళలకు రక్షణ ఉందా ? ఆ ముగ్గురికి ఉరిశిక్ష వేయాలి

ఖాదర్‌పై కిడ్నాప్ కేసుతోపాటు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. కాగా, మహిళలు, యువతులు ఒంటరిగా బయటకు వచ్చేటప్పుడు కుటుంబ సభ్యుల సాయం తీసుకోవాలని పోలీసులు సూచించారు. మహిళలు దిశ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలని, ఈ యాప్ ఆపద సమయంలో కవచంలా ఉపయోగపడుతుందని చెప్పారు.