Vijayawada Girl Suicide : విజయవాడ బాలిక ఆత్మహత్య కేసు.. సీఎం జగన్ న్యాయం చేస్తారనే నమ్మకముంది
నా మనవరాలిని ఎవరికీ చెప్పలేని విధంగా లైంగికంగా వేధించినట్లు సూసైడ్ నోట్ లో రాసింది. నా మనవరాలి మరణానికి కారణమైన వినోద్ జైన్‌ని కఠినంగా శిక్షించాలి. సీఎం జగన్ న్యాయం చేస్తారనే..

Vijayawada Girl Suicide
Vijayawada Girl Suicide : లైంగిక వేధింపులు తాళలేక విజయవాడలో బాలిక (9వ తరగతి) ఆత్మహత్య చేసుకున్న ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. టీడీపీ నేత వినోద్ జైన్ లైంగిక వేధింపులకు పాల్పడినట్టు బాలిక సూసైడ్ నోట్ రాసింది. ఈ ఘటనపై బాలిక తాత మాణిక్యాలరావు స్పందించారు.
వాకింగ్‌కు వెళ్లి వచ్చేసరికి ఘోరం జరిగిపోయిందని ఆయన కన్నీరుమున్నీరు అయ్యారు. నిన్న మధ్యాహ్నం నుండి తన మనవరాలు మూడీగా ఉందని ఆయన చెప్పారు. ఎన్ని ప్రశ్నలు అడిగినా ఎలాంటి సమాధానం చెప్పలేదన్నారు. సాయంత్రం 4 గంటలకు నేను, నా కుమార్తె వాకింగ్ కి వెళ్తున్న సమయంలో తన మనవరాలు పలకరించిందన్నారు. వాళ్ల అమ్మ దగ్గరికి వచ్చి ఐ లవ్ యూ మమ్మీ అని రెండుసార్లు అనిందని, తల్లిని కౌగిలించుకుందని చెప్పారు. ఆ తర్వాత నేను, నా కూతురు వాకింగ్ కి వెళ్లామని తెలిపారు. ఇంతలో.. ఎవరో చిన్నారి సూసైడ్ చేసుకుందని అపార్ట్ మెంట్ వాసులు చెబితే అక్కడికి వెళ్లి చూశామన్నారు. అక్కడ నిర్జీవంగా తన మనవరాలు పడి ఉందని కంటతడి పెట్టారు.
Karimnagar : కారు నడిపింది 14 ఏళ్ల మైనర్.. బ్రేక్‌కు బదులు క్లచ్ తొక్కడంతో ప్రమాదం
”వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాం. ఘటనా స్థలానికి వచ్చి పోలీసులు నా మనవరాలు బెడ్ రూమ్ కి వెళ్లారు. బెడ్ రూమ్ లో తన బుక్ లో సూసైడ్ నోట్ రాసి ఉంది. అందులో మేము మాట్లాడలేని విధంగా వినోద్ జైన్ నా మనవరాలిని ఎవరికీ చెప్పలేని విధంగా లైంగికంగా వేధించినట్లు సూసైడ్ నోట్ లో రాసింది. నా మనవరాలి మరణానికి కారణమైన వినోద్ జైన్ ని కఠినంగా శిక్షించాలి. సీఎం జగన్ న్యాయం చేస్తారనే ఆశిస్తున్నాం” అని బాలిక తాత మాణిక్యాలరావు అన్నారు.
కాగా, బాలిక నోట్ ఆధారంగా పోక్సో కేసు నమోదు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు చేసి నిందితుడికి కఠిన శిక్ష పడేలా చేస్తామన్నారు. వినోద్ జైన్ గత 2 నెలలుగా బాలికను వేధిస్తున్నాడని, ఈ క్రమంలోనే బాలిక నిన్న భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు.
Over Weight : అధిక బరువుకు ఆయుర్వేదంతో చెక్
తల్లిదండ్రులకు కూడా చెప్పుకోలేని విధంగా గత రెండు నెలల నుంచి నిందితుడు బాలికను లైంగికంగా వేధిస్తున్నాడని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. ఇది చాలా దుర్మార్గం అన్నారు. దీనిపై సీఎం జగన్ తనను పిలిచి వివరాలు ఆరా తీశారని మంత్రి వెల్లంపల్లి చెప్పారు. నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని మంత్రి అన్నారు.