Vijayawada : దుర్గగుడిలో మరోసారి బయటపడ్డ చైర్మన్, ఈవో మధ్య విభేధాలు..
చైర్మన్ పేషీలో సీసీ, అటెండర్లు, సిబ్బంది మార్పు జరిగింది. శాకంబరి ఉత్సవాల వేళ చైర్మన్ పేషీలో సీసీ చార్జ్ తీసుకోని పరిస్థితి. ఇద్దరు అటెండర్లకు గానా ఒక్క అటెంబ్ ను మాత్రమే నియమించటంపై ఈవోపై చైర్మన్, పాలకమండలి సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈవో తీరుతో ఒక్క అటెండర్‌ను పేషీ నుంచి చైర్మన్ వెనక్కి పంపేశారు.

Vijayawada kanakadurgamma temple
Vijayawada kanakadurgamma temple : ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ గుడిలో అధికారుల మధ్య విభేధాలు మరోసారి బయటపడ్డాయి. దుర్గమ్మ శాకాంబరీ ఉత్సవాల వేళ చైర్మన్, ఈవో మధ్య విభేధాలు మరోసారి బయటపడ్డాయి. ఈవో భ్రమరాంబ తీరుపై చైర్మన్ కర్నాటి రాంబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దుర్గగుడి అంతర్గత బదిలీల్లో భాగంగా చైర్మన్ పేషీలోనూ విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులను ఇతర విభాగాల్లోకి ఈవో బ్రమరాంబ బదిలీ చేశారు.
ఈ బదలీల్లో భాగంగా చైర్మన్ పేషీలో సీసీ, అటెండర్లు, సిబ్బంది మార్పు జరిగింది. శాకంబరి ఉత్సవాల వేళ చైర్మన్ పేషీలో సీసీ చార్జ్ తీసుకోని పరిస్థితి నెలకొంది. ఇద్దరు అటెండర్లకు గానా ఒక్క అటెంబ్ ను మాత్రమే నియమించటంపై ఈవోపై చైర్మన్, పాలకమండలి సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈవో తీరుతో ఒక్క అటెండర్‌ను పేషీ నుంచి చైర్మన్ వెనక్కి పంపేశారు. దీంతో చైర్మన్ పేషీలో దేవస్ధానం సిబ్బంది కూడా కనిపించని పరిస్థితి ఉంది. దుర్గమ్మ దేవాలయంలో కనులపండుగా జరిగిన శాకంబరీ ఉత్సవాల వేళ దేవస్ధానం సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో చైర్మన్, పాలకమండలి సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గతంలో కూడా ఈవో ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారని ఇటువంటి వ్యవహారాలు సరైనవి కావని అభిప్రాయాలు వచ్చాయి. దీంతో ఈవో ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ సీఎం వైఎస్ జగన్ కు చైర్మన్ కర్నాటి రాంబాబు ఫిర్యాదు చేశారు. మరి జగన్ స్పందించారో లేదో తెలీదుగానీ ఈ వివాదాలు..విభేధాలు మాత్రం కొనసాగుతు మరోసారి బయటపడ్డాయి. అదే మరోసారి బయటపడటంతో దేవాలయంలో ఇటువంటి రాజకీయాలు ఏంటీ అంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
ఈ బదిలీలపై ఈవో బ్రమరాంబ స్పందించారు. దుర్గగుడి లో అంతర్గత బదిలీలు నిబంధనలకు లోబడే చేశామని..నా పేషీలో సిబ్బందిని మార్చామనీ.. మరికొన్ని విభాగాల్లో బదిలీలు చేశామని లీగల్, ల్యాండ్స్ తో పాటు ఇతర విభాగాల్లో మార్పులు చేసామని స్పష్టంచేశారు. త్వరలోనే మెయిన్ డిపార్ట్మెంట్ లలో బదిలీలు చేపడతామని తెలిపారు. మూడునెలలు పూర్తైన వారిని మాత్రమే బదిలీలు చేశామని..మూడు నెలలు నిండని వారిని బదిలీలు చేశామన్నది అవాస్తవం అని తెలిపారు.దుర్గగుడితో పాటు ఇతర ఆలయాల్లో బదిలీలు సహజం అని ఈ విషయం అంత పట్టించుకోవాల్సిన అవసరంలేదంటూ కొట్టిపారేశారు.