బాచంపల్లి సంతోష్ కుమార్ ఉగాది పంచాంగం.. కొత్త వైరస్‌లు, ప్రకృతి వైపరీత్యాలు.. ఈ ఏడాది ఇలా చేస్తే శుభం..

ఈ ఏడాది ఆదివారం రోజుల్లో మాంసాహారాన్ని వదిలిపెట్టాలని చెప్పారు.

బాచంపల్లి సంతోష్ కుమార్ ఉగాది పంచాంగం.. కొత్త వైరస్‌లు, ప్రకృతి వైపరీత్యాలు.. ఈ ఏడాది ఇలా చేస్తే శుభం..

Dr. Bachampalli Santhosh Kumar Shastry

Updated On : March 28, 2025 / 8:01 PM IST

ఈ ఉగాది నుంచి దేశంలో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి? వాతావరణం, వర్షాల ప్రభావం మన దేశంపై ఎలా ఉండబోతుంది? అన్న వివరాలను శృంగేరీ శారదా పీఠం ఆస్థాన పండితుడు డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్‌ శాస్త్రి తెలిపారు.

విశ్వావసు నామ సంవత్సర ఉగాదిపై సంతోష్ కుమార్ 10టీవీతో మాట్లాడారు. “ఉగాది ఆదివారం వస్తుంది. ఈ ఉగాదికి దేవత సూర్యుడు. ఈ ఏడాది ఆదివారం నాడు మాంసాహారాన్ని వదిలిపెట్టాలి. ఈ ఏడాది ఆదివారం రోజుల్లో సూర్యుడి స్త్రోత్ర పారాయణం చేయాలి. అందరూ బాగుంటారు. లోకం బాగుంటుంది. ఆదివారం అంటో భోగానికి, చేయకూడని పనులు చేసేందుకు అని అనుకుంటున్నారు.

కొత్త వైరస్‌లు వచ్చే అవకాశం కూడా ఉంది. మన బలం, మన బలగం సూర్యుడే. మనమందరం కలిసి ఆదివారం నాడు సూర్యారాదన చేయాలి. షష్ఠగ్రహ కూటమి వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీని ప్రభావం దేశం మీద, రాష్ట్రం మీద పడుతుంది. మీన రాశిలోనే సూర్యుడు, శని, రాహువు, బుధుడి కలయిక ఉంది.

దీని ప్రభావం ఏడాది విశ్వం మీద పడుతుంది. దేశం మీద పడుతుంది. దేశంలో అక్కడక్కడ ప్రకృతి వైపరీత్యాలు జరుగుతాయి. ప్రజలు ఎక్కడ చూసినా అసంతృప్తితో ఉంటారు. ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. వ్యక్తిగత జాతకాల మీద ప్రభావం ఉండదు.

దేశ రాజకీయ రాజకీయాల మీద, ప్రకృతి మీద ప్రభావం ఉంటుంది. పంటలు పండే సమయానికి వర్షాలు పడి పంట కొట్టుకుపోవడం వంటివి జరగవచ్చు. దేవదాయ, ధర్మదాయ శాఖలు ప్రతి దేవాలయంలో ఆరాధనలు, లోకం కోసం ప్రార్థనలు చేయించాలి. ఆందోళన చెందకుండా ఆచరణలో ఇవి చేసి చూపించాలి” అని డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్‌ శాస్త్రి అన్నారు.