Gidugu Rudra Raju: 2024 ఎన్నికల్లో ఏపీలో 100 సీట్లు గెలుస్తాం: ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు

ఆంధ్రప్రదేశ్ లో 2024 అసెంబ్లీ ఎన్నికల్లో 100 సీట్లు గెలుస్తామని ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు అన్నారు. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీకి ఉజ్వల భవిష్యత్తు ఉందని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ ను, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడును ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. రాష్ట్రంలో లిక్కర్, ఎర్రచందనం, ఇసుక, మైన్స్, భూ మాఫియా పాలన సాగిస్తోందని విమర్శించారు.

Gidugu Rudra Raju: 2024 ఎన్నికల్లో ఏపీలో 100 సీట్లు గెలుస్తాం: ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు

Gidugu Rudra Raju

Updated On : February 20, 2023 / 5:23 PM IST

Gidugu Rudra Raju: ఆంధ్రప్రదేశ్ లో 2024 అసెంబ్లీ ఎన్నికల్లో 100 సీట్లు గెలుస్తామని ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు అన్నారు. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీకి ఉజ్వల భవిష్యత్తు ఉందని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ ను, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడును ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. రాష్ట్రంలో లిక్కర్, ఎర్రచందనం, ఇసుక, మైన్స్, భూ మాఫియా పాలన సాగిస్తోందని విమర్శించారు.

వైసీపీని ప్రజలు నమ్మడం లేదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్నామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రాణత్యాగాల నుంచి వచ్చిన పార్టీ అని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నిశ్శబ్ద విప్లవాన్ని సృష్టించబోతుందని అన్నారు. కాంగ్రెస్ మ్యాన్ ఫ్యాక్చరింగ్ యూనిట్ లాంటిదని, ఎంతోమంది నాయకులు, కార్యకర్తలను తయారు చేసిన చరిత్ర కాంగ్రెస్ కి ఉందని చెప్పారు.

ముఖ్యమంత్రి జగన్, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు కూడా కాంగ్రెస్ నుంచే నాయకులుగా ఎదిగారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఉద్యోగస్థులకు భద్రత లేదని, సమస్యలు పరిష్కారం కావడం లేదని చెప్పారు. అందుకే వారు గవర్నర్ ను కలిశారని తెలిపారు.

ఈ సందర్భంగా కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ చింతా మోహన్ మాట్లాడుతూ… నాలుగున్నర నెలలు కొన్ని వందల గ్రామాలు తిరిగానని, వేల మందిని కలిశానని అన్నారు. శ్రీకాకుళం నుంచి కర్నూలు వరకు కాంగ్రెస్ గురించి అన్వేషణ చేశానని వ్యాఖ్యానించారువ. పేదలు, దళితుల హృదయంలో కాంగ్రెస్ బతికే ఉందని తెలిపారు. కాంగ్రెస్ రావాలని, కావాలని పేదలు కోరుకుంటున్నారని చెప్పారు.

Drone Delivers Pension : వావ్.. డ్రోన్‌తో ఇంటి వద్దకే పెన్షన్ పంపిణీ, ఆనందంలో లబ్దిదారుడు