పొలిటికల్ హీట్ పెంచుతున్న ఇద్దరు శ్రీనులు.. ఎలాగంటే?
మంత్రిని ఇలా ఒంటరి చేయడంలో మిగిలిన ఎమ్మెల్యేలు కావాలనే చేస్తున్నారా అన్నది మాత్రం తెలియటం లేదట.

ఒకరేమో మాస్ లీడర్..మరొకరు క్లాస్ లీడర్. ఇద్దరి పేర్లు ఒక్కటే అయినా,..పార్టీలు వేరు. అందుకే పొలిటికల్ ఫైట్ కి సై సై అంటున్నారు ఆ ఇద్దరు లీడర్లు. ఆ ఇద్దరు శ్రీనుల మధ్య తలెత్తిన పొలిటికల్ వార్ ఇప్పుడు ఆ జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. ఒకరు రాష్ట్రానికి మంత్రి కాగా, మరొకరు జడ్పీ చైర్మన్. టీడీపీ, వైసీపీల మధ్య జరుగుతున్న పొలిటికల్ ఫైట్ కి ఈ ఇద్దరు నేతలు మరింత తాలింపు వేస్తున్నారంట. ఇంతకీ, ఎవరా ఇద్దరు శ్రీనులు..వారి మధ్య నెలకొన్న ఆ పొలిటికల్ ఫైట్ ఏంటి…ఏ జిల్లాలో ఈ పరిస్థితి నెలకొంది? వాచ్ థిస్ స్టోరీ.
విజయనగరం జిల్లాలో కూటమి, వైసీపీల మధ్య తలెత్తిన పొలిటికల్ ఫైట్..ఇప్పుడు మరింత రసవత్తరంగా మారింది. ఏకంగా ఇద్దరు బడా నేతలు ఫేస్ టు ఫేస్ తలపడటం జిల్లా రాజకీయ వర్గాల్లో ఆసక్తిని పెంచిందట. ఇందులో ఒకరు రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కాగా, మరొకరు జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీను. నిన్నా మొన్నటి వరకు వీరి మధ్య అంతగా రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు లేకపోయినా, సరిగ్గా 4 రోజుల క్రితం జడ్పీ సర్వసభ్య సమావేశంలో వీరి మధ్య జరిగిన వాగ్వివాదం రాజకీయ దుమారాన్ని రేపిందనే టాక్ విన్పిస్తోంది.
అయితే ఇది జస్ట్ శాంపిల్ మాత్రమేనని, రాబోయే రోజుల్లో ఈ పొలిటికల్ ఫైట్ మరింత ముదురుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదంతా రాజకీయాల్లో కామనే అయినా, దీని వెనుక రాజకీయ వ్యూహం కూడా లేకపోలేదనే చర్చ నడుస్తోంది. జిల్లాలో స్థానిక సంస్థల ప్రతినిధిగా..జిల్లా మొత్తాన్ని నేత తన గుప్పిట్లో పెట్టుకున్న నేత ఒకరైతే, రాష్ట్ర్ర మంత్రి హోదాలో అధికారంలో ఉన్న నేత మరొకరు కావడంతో వీరిద్దరి మధ్య రాజకీయ పోరు..రసవత్తరంగా మారిందనే టాక్ జిల్లా రాజకీయాల్లో విన్పిస్తోంది. ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పటికీ, జెడ్పీ ఛైర్మన్ హోదాలో జిల్లాలో చక్రం తిప్పుతున్న చిన్న శ్రీనుకు అడ్డుకట్ట వేసేందుకే మంత్రి కొండపల్లి శ్రీనివాస్..గేర్ మార్చి స్పీడ్ పెంచారన్న టాక్ నడుస్తోంది.
Also Read: కంచ భూముల వెనకున్న ఆ బీజేపీ ఎంపీ ఎవరు? రోజుకో మలుపు తిరుగుతున్న భూముల వ్యవహారం
చిన్న శ్రీను హవాకు చెక్ పెట్టేందుకు..
జెడ్పీ ఛైర్మన్ గా ప్రతిపక్షంలో చిన్న శ్రీను హవాకు చెక్ పెట్టేందుకు మంత్రి కొండపల్లి ఛాన్స్ దొరికినప్పుడల్లా ఎదురుదాడి చేస్తున్నారట. ముఖ్యంగా జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాల్లో మెజార్టీ పక్షం వైసీపీ సభ్యులే ఉండటం, వారంతా మంత్రి కంటే సీనియర్లే కావడం..మంత్రి కొండపల్లికి కొన్ని సార్లు ఇబ్బందులు ఎదురవుతున్నాయంట. ఇటువంటి పరిస్థితిల్లో మిగిలిన ఎమ్మెల్యేలు తనకి సపోర్ట్ గా ఉండకుండా ఒక్కోసారి ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారన్న చర్చ నడుస్తోంది.
అయితే, మంత్రిని ఇలా ఒంటరి చేయడంలో మిగిలిన ఎమ్మెల్యేలు కావాలనే చేస్తున్నారా అన్నది మాత్రం తెలియటం లేదట. ప్రస్తుతం జిల్లాలో పెన్షన్ల వ్యవహారం రాజకీయ రంగు పులుముకోవడంతో..ప్రభుత్వాన్ని, ఆ శాఖ చూస్తోన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ను ఇరకాటంలో పెట్టేలా..వైసీపీ నేతలు నిరసనలకు ప్లాన్ చేస్తున్నారట. అయితే వైసీపీ వేసే ఎత్తులకు చెక్ పెట్టేందుకు మంత్రి కొండపల్లి పెద్ద స్కేచ్చే వేశారన్న టాక్ జిల్లా రాజకీయవర్గాల్లో విన్పిస్తోంది.
మొత్తం మీద..స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతుండటంతో స్థానిక సంస్థల ప్రతినిధిగా, సీనియర్ పొలిటీషియన్ గా జిల్లాలో తన హవాను కొనసాగించేలా జెడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ప్లాన్ చేస్తున్నారంట. అయితే వైసీపీ నేతలకు చెక్ పెట్టి, తన పవర్ ఏంటో చూపించేందుకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సరికొత్త రాజకీయ ఎత్తుగడలను అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారంట. వైసీపీ వైపు ఉన్న పవర్ సెంటర్ ను తమ వైపు తిప్పుకునేలా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ట్రెండీ పాలిటిక్స్ కు శ్రీకారం చుట్టారన్న టాక్ విన్పిస్తోంది. అయితే రాబోయే రోజుల్లో వీరిద్దరి మధ్య నెలకొన్న పొలిటికల్ వార్ ఎటు టర్న్ తీసుకుంటుందో అన్నది వేచి చూడాల్సిందే.