Chandrababu Interrogation : సీఐడీ కస్టడీకి చంద్రబాబు.. కస్టడీలో సీఐడీ వేసే ప్రశ్నలు ఏంటి, ఏయే అంశాలపై ప్రశ్నిస్తారు.. విచారణ ఎలా ఉండబోతోంది?

విచారణకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించకూడదని ఆదేశించారు. చంద్రబాబు వయసు, ఆరోగ్యాన్ని.. Chandrababu CID Interrogation

Chandrababu Interrogation : సీఐడీ కస్టడీకి చంద్రబాబు.. కస్టడీలో సీఐడీ వేసే ప్రశ్నలు ఏంటి, ఏయే అంశాలపై ప్రశ్నిస్తారు.. విచారణ ఎలా ఉండబోతోంది?

Chandrababu CID Interrogation

Chandrababu CID Interrogation : స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైల్లో (Rajahmundry Central Prison) రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబును సీఐడీ కస్టడీకి అప్పగిస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు శుక్రవారం (సెప్టెంబర్ 22) తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. చంద్రబాబును 5 రోజుల కస్టడీకి సీఐడీ కోరగా.. కోర్టు 2 రోజుల కస్టడీకే అనుమతి ఇచ్చింది. చంద్రబాబును విచారిస్తే స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ (Skill Development Scam) లో మరిన్ని కీలక అంశాలు వెలుగులోకి వస్తాయని సీఐడీ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు.

స్కిల్ స్కామ్ లో ఎవరెవరున్నారు?
స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో చంద్రబాబుకు ఎవరెవరు సహకరించారు? ఈ స్కామ్ లో ఇంకా ఎవరెవరు ఉన్నారు? అనే విషయాలు వెలుగులోకి వస్తాయని సీఐడీ తరపు న్యాయవాదులు కోర్టుకి తెలిపారు. ఈ వాదనతో ఏకీభవించిన న్యాయమూర్తి చంద్రబాబును రెండు రోజుల సీఐడీ కస్టడీకి అప్పగించారు.

Also Read: చంద్రబాబును రెండు రోజులు సీఐడీ కస్టడీకి ఇస్తూ తీర్పు.. రాజమండ్రి సెంట్రల్ జైల్లో విచారించేందుకు అనుమతించిన ఏసీబీ కోర్టు

చంద్రబాబు విచారణకు పలు నిబంధనలు:
ఇక, చంద్రబాబు కస్టడీకి సంబంధించి పలు సూచనలు, ఆదేశాలు చేసింది ఏసీబీ కోర్టు. ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారించాలని ఆదేశించింది. న్యాయవాదుల సమక్షంలోనే విచారణ జరపాలన్నారు. విచారణకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించకూడదని ఆదేశించారు. విచారణకు సంబంధించిన ఫోటోలు కానీ వీడియోలు కానీ బయటకు రాకూడదన్నారు. చంద్రబాబు వయసు, ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కస్టడీ ముగిసిన అనంతరం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయమూర్తి ఎదుట హాజరుపరచాలన్నారు. చంద్రబాబు కస్టడీ విచారణ అంశాలను కోర్టు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తుందన్నారు.

Chandrababu CID Interrogation

Chandrababu CID Interrogation

సీఐడీ అధికారులు రేపు(సెప్టెంబర్ 23), ఎల్లుండి(సెప్టెంబర్ 24) చంద్రబాబును తమ కస్టడీలోకి తీసుకోనున్నారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే సీఐడీ అధికారులు చంద్రబాబును విచారించనున్నారు.

Also Read: చంద్రబాబుకు మరో రెండు రోజులు రిమాండ్ పొడిగింపు.. జడ్జితో బాబు ఏమన్నారంటే

కాగా, కస్టడీలో సీఐడీ అధికారులు చంద్రబాబును అడిగే ప్రశ్నలు ఏంటి? ఏయే అంశాల మీద చంద్రబాబుని వారు విచారించనున్నారు? అసలు సీఐడీ విచారణ ఏ విధంగా ఉండనుంది? అనే అంశాలు ఆసక్తికరంగా మారాయి. కస్టడీలో పలు కీలక ప్రశ్నలకు చంద్రబాబు నుంచి సమాధానాలు రాబట్టేందుకు సీఐడీ అధికారులు ప్రిపేర్ అయినట్లుగా తెలుస్తోంది.

Chandrababu CID Interrogation

Chandrababu CID Interrogation

సీఐడీ అధికారులు చంద్రబాబుకు వేసే ప్రశ్నలు ఈ విధంగా ఉండే అవకాశం ఉంది..
1. సీమెన్స్ కంపెనీతో మీరు చేసుకున్న ఒప్పందం ఏంటి?
2. జీవో నెం-4, సీమెన్స్ తో చేసుకున్న ఎంవోయూకు ఎందుకు తేడాలు ఉన్నాయి?
3. కేబినెట్ అనుమతి లేకుండా స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఎందుకు ఏర్పాటు చేశారు?
4. కార్పొరేషన్ నుంచి షెల్ కంపెనీలకు నిధుల వ్యవహారం మీకు తెలిసే జరిగిందా?
5. స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ కోసం నియమించిన అధికారులను ఏ ప్రాతిపదికన తీసుకున్నారు?
6. అసలు స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ కు సరఫరా అయిన మెటీరియల్ ఖర్చు ఎంత?