Kinjarapu Atchannaidu : ఎందుకంత వణికిపోతున్నారు, మిమ్మల్ని తరిమికొట్టడం ఖాయం- వైసీపీ నేతలపై అచ్చెన్నాయుడు ఫైర్
ప్రజాబలం ఉన్న నాయకుడు చంద్రబాబు. ఎన్ని కేసులు పెట్టినా టీడీపీ జెండా దారంలోని నూలుపోగును కూడా.. Kinjarapu Atchannaidu

Kinjarapu Atchannaidu Fires On YSRCP (Photo : Google)
Kinjarapu Atchannaidu Fires On YSRCP : చంద్రబాబుకి మద్దతుగా ప్రజలు ర్యాలీగా వస్తే మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? అని వైసీపీ నేతలపై ఫైర్ అయ్యారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. నిన్న చంద్రబాబుకి మద్దతు తెలిపేందుకు వచ్చిన జన సందోహాన్ని చూసి సీఎం జగన్ సహా వైసీపీ నేతలు వణికిపోతున్నారు అని ఆయన అన్నారు. కోర్టు షరతులు లేకుంటే చంద్రబాబుకు మద్దతు తెలిపేందుకు నిన్న వచ్చిన వారికంటే నాలుగు రెట్లు ఎక్కువ మంది జనం వచ్చే వారని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు, లోకేశ్ ని చూస్తే వైసీపీ నేతలు ఎందుకంత వణికిపోతున్నారు? అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. లోకేశ్ ఢిల్లీ వెళ్తే వైసీపీ నేతలు గల్లీల్లో పెడబొబ్బలు పెడుతున్నారని విమర్శించారు.
”చంద్రబాబు బెయిల్ పై బయటకొస్తే వైసీపీ నేతలు వణికిపోతున్నారు. స్కిల్ కేసులో ఒక్క ఆధారం సేకరించలేకపోయారు. ఇప్పుడు మద్యంలో అక్రమాలంటూ చంద్రబాబుపై మరో అక్రమ కేసు పెట్టారు. ప్రజాబలం ఉన్న నాయకుడు చంద్రబాబు. ఎన్ని కేసులు పెట్టినా టీడీపీ జెండా దారంలోని నూలుపోగును కూడా పీకలేరు. మరో 5 నెలల తర్వాత వైసీపీ నేతలను ప్రజలు రాష్ట్రం నుంచి తరిమికొట్టడం ఖాయం” అని వార్నింగ్ ఇచ్చారు అచ్చెన్నాయుడు.
Also Read : చంద్రబాబు విషయంలో న్యాయం గెలిచిందా? రోగం గెలిచిందా?
కాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి మంగళవారం (అక్టోబర్ 31) సాయంత్రం విడుదలైన సంగతి తెలిసిందే. అనారోగ్య కారణాలతో హైకోర్టు ఆయనకు 4 వారాల మధ్యంతర బెయిల్ ఇచ్చింది. నాలుగు వారాల అనంతరం నవంబర్ 28న సాయంత్రం 5 గంటల్లోపు సరెండర్ అవ్వాలని చంద్రబాబుని ఆదేశించింది కోర్టు. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు సెప్టెంబర్ 9న అరెస్ట్ అయ్యారు. 52 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. మధ్యంతర బెయిల్ మంజూరు కావడంతో నిన్న జైలు నుంచి బయటకు వచ్చారు. చంద్రబాబుకి పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు, మద్దతుదారులు ఘన స్వాగతం పలికారు.
చంద్రబాబు బెయిల్ పై విడుదల కావడంతో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. నాయకులు, కార్యకర్తలు టపాసులు కాల్చారు. స్వీట్లు తినిపించుకున్నారు. వారి సంబరాలు అంబరాన్నంటాయి. కాగా, టీడీపీ నేతల సంబరాలపై వైసీపీ నేతలు ఫైర్ అయ్యారు. సంబరాలు చేసుకోవడానికి సిగ్గుండాలి అని మండిపడ్డారు. చంద్రబాబు బెయిల్ పై బయటకు వచ్చారు అంతే.. నిర్దోషిగా కాదు, చంద్రబాబు మళ్లీ అదే రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్లాలి, గుర్తుంచుకోండి అని వైసీపీ నేతలు విమర్శలు చేశారు. వారి విమర్శలకు టీడీపీ నేతలు అదే రేంజ్ లో కౌంటర్లు ఇస్తున్నారు.
Also Read : చంద్రబాబు మళ్లీ అదే జైలుకెళ్లాలి, సంబరాలు చేసుకోవడానికి సిగ్గుండాలి- టీడీపీ నేతలపై వైసీపీ నేతలు ఫైర్