చిత్తూరులో విషాదం : అమ్మఒడి డబ్బు కోసం భార్య ఆత్మహత్య

చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం నేతిగుట్లపల్లెలో విషాదం చోటు చేసుకుంది. అమ్మఒడి డబ్బు ఒకరి ప్రాణం తీసింది. అమ్మఒడి డబ్బు ఓ కుటుంబంలో చిచ్చు రేపింది. అమ్మఒడి

  • Published By: veegamteam ,Published On : January 14, 2020 / 09:15 AM IST
చిత్తూరులో విషాదం : అమ్మఒడి డబ్బు కోసం భార్య ఆత్మహత్య

Updated On : January 14, 2020 / 9:15 AM IST

చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం నేతిగుట్లపల్లెలో విషాదం చోటు చేసుకుంది. అమ్మఒడి డబ్బు ఒకరి ప్రాణం తీసింది. అమ్మఒడి డబ్బు ఓ కుటుంబంలో చిచ్చు రేపింది. అమ్మఒడి

చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం నేతిగుట్లపల్లెలో విషాదం చోటు చేసుకుంది. అమ్మఒడి డబ్బు ఒకరి ప్రాణం తీసింది. అమ్మఒడి డబ్బు ఓ కుటుంబంలో చిచ్చు రేపింది. అమ్మఒడి డబ్బు కోసం భార్య, భర్తల మధ్య గొడవ జరిగింది. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. తీవ్ర మనస్తాపం చెందిన భార్య.. పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. దీంతో స్థానికంగా విషాదచాయలు అలుముకున్నాయి. ఈ ఘటన స్థానికులను షాక్ కు గురి చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. విచారణలో పూర్తి వివరాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు.

మృతురాలి పేరు ఆదిలక్ష్మి. ఆమె భర్త మహేశ్వర్. అమ్మఒడి స్కీమ్ కింద వీరి కూతురికి రూ.15వేలు వచ్చాయి. ఆదిలక్ష్మి ఆ డబ్బుని బ్యాంకు నుంచి విత్ డ్రా చేసి ఇంటికి తెచ్చింది. ఆ డబ్బు తనకు ఇవ్వాలని భర్త మహేశ్వర్ అడిగాడు. అందుకు భార్య ఆదిలక్ష్మి నిరాకరించింది. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. మనస్తాపం చెందిన ఆదిలక్ష్మి పురుగుల మందు తాగి చనిపోయింది.

ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకం అమ్మఒడి. ఇటీవలే(జనవరి 9,2020) సీఎం జగన్ చిత్తూరులో అమ్మఒడి పథకాన్ని ప్రారంభించారు. సీఎం ప్రకటించిన నవరత్నాల్లో ఒకటి అమ్మఒడి స్కీమ్. పేదింటి తల్లులు, పిల్లలకు ఆర్థికంగా అండగానే ఉండేదుకు ‘జగనన్న అమ్మఒడి’ పథకాన్ని తీసుకొచ్చామని సీఎం జగన్ చెప్పారు. ఈ పథకం కింద 42లక్షల 12వేల 185 మంది తల్లులకు.. 81లక్షల 72వేల 222 మంది పిల్లలకు లబ్ది జరిగింది. అర్హులైన తల్లుల అకౌంట్ లో ప్రభుత్వం రూ.15వేలు జమ చేసింది. ప్రతి ఏటా రూ.15వేలు ఇస్తామని సీఎం జగన్ చెప్పారు. 1 నుంచి ఇంటర్ వరకు విద్యార్థులకు ఈ స్కీమ్ వర్తిస్తుంది.

ఈ పథకానికి ప్రభుత్వం రూ.6,456 కోట్లు కేటాయించింది. కాగా, వివిధ కారణాలతో కొందమంది అనర్హుల జాబితాలో చేరారు. అమ్మఒడికి అర్హులై ఉండి నగదు రాని వారు సంక్రాంతి తర్వాత దరఖాస్తు చేసుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. ఈ పథకం వర్తించాలంటే ప్రభుత్వం పలు నిలబంధనలు విధించింది. ప్రభుత్వం చెప్పిన పత్రాలను సమర్పిస్తేనే అర్హులు అని తెలిపింది.

ఆర్థికంగా అండగా ఉండేందుకు సీఎం జగన్ ఈ పథకాన్ని తీసుకొచ్చారు. అయితే అమ్మఒడి డబ్బు కొన్ని కుటుంబాల్లో చిచ్చు రేపుతోంది. డబ్బు కోసం భార్య, భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. పిల్లల చదువు కోసం గొప్ప ఆశయంతో సీఎం జగన్ డబ్బు వేస్తే.. కొందరు వ్యక్తులు తమ అవసరాలకు ఆ డబ్బుని వాడుకుంటున్నారు. దీంతో కుటుంబంలో విభేదాలు వస్తున్నాయి. చిత్తూరు జిల్లాలో అదే జరిగింది. అమ్మఒడి డబ్బు కోసం భార్య, భర్తలు గొడవపడ్డారు. మనస్తాపం చెందిన భార్య ఆత్మహత్య చేసుకుంది.

Also Read : రాజకీయాలు వదిలేస్తా.. చంద్రబాబు సంచలన స్టేట్ మెంట్