ఈజీ మనీ కోసం భర్త వికృత చేష్టలు

  • Published By: murthy ,Published On : November 22, 2020 / 01:33 PM IST
ఈజీ మనీ కోసం భర్త వికృత చేష్టలు

Updated On : November 22, 2020 / 2:41 PM IST

Wife register complaint against husband misbehavior : ఈజీ మనీ సంపాదన కోసం కొందరు ఎంతకైనా తెగిస్తున్నారు. యూట్యుబ్ లో పోర్న్ వీడియోలకు వున్న డిమాండ్ ను దృష్టిలో పెట్టుకుని తన భార్య నగ్న వీడియోలు యూట్యూబ్ లో అప్ లోడ్ చేసిన భర్త ఉదంతం గుంటూరులో వెలుగుచూసింది. భర్త వికృతరూపాన్ని పసిగట్టిన భార్య అలర్టై పోలీసులను ఆశ్రయించింది.

గుంటూరు ఏటీ అగ్రహారానికిచెందిన ఓ మహిళ భర్త ఎటువంచి పని పాటలు చేయకుండా ఖాళీగా ఉంటున్నాడు. ఈజీగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశ్యంతో భార్యతో సన్నిహితంగా ఉన్న వీడియోలను యూట్యూబ్ లో పోస్ట్ చేశాడు. ఇది తెలుసుకున్న భార్య వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు వెంటనే కేసును దిశా పోలీసు స్టేషన్ కు బదిలీ చేశారు.



కేసు నమోదు చేసుకున్న పోలీసులు యుధ్దప్రాతిపదికన ఐటీ కోర్ బృందంతో వీడియోలు తొలగించే పనిలో పడింది. మహిళ భర్త యూట్యూబ్ లోనే పోస్ట్ చేశాడా…లేక ఇతర సోషల్ మీడియా ప్లాట్ ఫాంలలో కూడా పోస్టే చేశాడా అనే కోణంలో కూడా విచారణ చేపట్టారు. ఈ కేసును స్వయంగా అర్బన్ పోలీసు ఉన్నతాధికారి పరిశీలిస్తున్నారు.