2024లో మార్పును తీసుకురాబోతున్నాం- పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు

నూతన చేరికలతో ఉమ్మడి కృష్ణా జిల్లాలో పార్టీ మరింత బలోపేతం అవుతుందన్నారు పవన్ కల్యాణ్.

2024లో మార్పును తీసుకురాబోతున్నాం- పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు

Pawan Kalyan

Updated On : January 3, 2024 / 5:22 PM IST

Pawan Kalyan : జనసేనలో చేరికల జోష్ నెలకొంది. వైసీపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి పలువురు జనసేనలో చేరారు. ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్, వైసీపీ నాయకులు జనసేన కండువా కప్పుకున్నారు. బుధవారం మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వారికి కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.

Also Read : ష‌ర్మిల కాంగ్రెస్‌లో చేరికపై కాకినాడ సభలో జగన్ పరోక్ష వ్యాఖ్యలు.. ఏమన్నారంటే?

కాంగ్రెస్ పార్టీ విజయవాడ నగర మాజీ అధ్యక్షుడు బాడిత శంకర్, మాజీ కార్పొరేటర్లు చిలక సలోమి భగవాన్, సముద్రాల ప్రసాద్, అవనిగడ్డకు చెందిన వైసీపీ నాయకుడు రామాంజనేయులు జనసేనలో చేరారు. ఈ చేరికల కార్యక్రమంలో జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు.

Also Read : కేంద్రానికి పవన్ రాసిన లేఖపై స్పందించిన సీఎం జగన్ .. కాకినాడ సభలో స్ట్రాంగ్ కౌంటర్

చేరికల సందర్భంగా మాట్లాడిన పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. నన్ను నమ్మి పార్టీలోకి వచ్చిన అందరి నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం అన్నారు. నూతన చేరికలతో ఉమ్మడి కృష్ణా జిల్లాలో పార్టీ మరింత బలోపేతం అవుతుందన్నారు. మీరంతా మార్పు కోరి పార్టీలోకి వచ్చారన్న పవన్ కల్యాణ్.. 2024లో ఆ మార్పును తీసుకురాబోతున్నామన్నారు. ప్రభుత్వంలో బలమైన భాగస్వామ్యం తీసుకుంటామని పవన్ కల్యాణ్ చెప్పారు.