Somu Veerraju : బీజేపీకి అధికారమిస్తే మూడేళ్లలో అమరావతి నిర్మాణం

మేము అధికారంలోకి వస్తే మూడు రాజధానులు ఉండవు అన్నారు. అంతేకాదు మూడేళ్లలో అమరావతిని కట్టేస్తామన్నారు.

Somu Veerraju : బీజేపీకి అధికారమిస్తే మూడేళ్లలో అమరావతి నిర్మాణం

Somu Veerraju

Updated On : January 20, 2022 / 7:21 AM IST

Somu Veerraju : ఏపీలో బీజేపీ అధికారంలోకి వస్తే మూడేళ్లలో రాజధాని అమరావతిని కట్టి తీరుతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. కర్నూలులో మీడియాతో మాట్లాడిన ఆయన.. మేము అధికారంలోకి వస్తే మూడు రాజధానులు ఉండవు అన్నారు. అంతేకాదు మూడేళ్లలో అమరావతిని కట్టేస్తామన్నారు. మూడేళ్లలో సీఎం జగన్ ఒక్క ఆర్ అండ్ బీ రోడ్డు కూడా వేయలేదన్నారు. పాలనలో జగన్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని సోము వీర్రాజు విమర్శించారు.

అమరావతి పేరుతో చంద్రబాబు ఐదేళ్ల ప్రజలను మోసం చేయగా.. మూడు రాజధానుల పేరుతో జగన్ మూడేళ్లు కాలయాపన చేశారని సోము వీర్రాజు మండిపడ్డారు. బీజేపీ అధికారం చేపట్టిన వెంటనే మూడేళ్లలో అమరావతిని రాజధానిగా నిర్మించి తీరుతామని హామీ ఇచ్చారు.

Corona Medicines : హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నవాళ్లు తీసుకోవాల్సిన మందులు.. ప్రభుత్వం మార్గదర్శకాలు

జగన్ ప్రభుత్వం పాలనలో పూర్తిగా విఫలమైందన్న సోము వీర్రాజు.. కేంద్ర ప్రభుత్వ నిధులతో రాష్ట్రంలో నిధులు ఖర్చు చేస్తూ పబ్లిసిటీ చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. వైసీపీకి ఓటు వేయకపోతే.. సంక్షేమ పథకాలు నిలిపేస్తామని వాలంటీర్లతో ప్రజలను బెదిరింపులకు గురి చేస్తుండటం సిగ్గు చేటన్నారు.

బీజేపీ మతతత్వ పార్టీ అని చెప్పుకుంటున్న వైసీపీ నేతలు.. రాష్ట్ర ప్రభుత్వ డబ్బులతో చర్చిలు, మసీదులకు నిధులు కేటాయిస్తూ.. పాస్టర్, మౌజమ్‌లకు జీతాలు ఇవ్వడం మతతత్వాన్ని ప్రోత్సహించడం కాదా అని ప్రశ్నించారు సోము వీర్రాజు. కర్నూలు జిల్లాలోని బనగానపల్లెలో ఆళ్లగడ్డ, డోన్, బనగానపల్లె నియోజకవర్గాల బీజేపీ కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు సోము వీర్రాజు.

Amazon Sale: అమెజాన్ రిపబ్లిక్ డే సేల్ లో రూ.15 వేలలోపు స్మార్ట్ ఫోన్స్https://10tv.in/technology/top-budget-friendly-smartphones-on-amazon-republic-day-sale-354867.html

ఏపీలో వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. పార్టీ బలోపేతానికి చర్యలు చేపట్టిన బీజేపీ నేతలు.. రాయలసీమపై ఫోకస్ పెట్టారు. రాయలసీమ జిల్లాల్లో విస్తృత పర్యటనకు ఏపీ బీజేపీ చీఫ్ సోమువీర్రాజు వచ్చారు. కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల్లో ఆయన పర్యటిస్తారు.