vijayawada Minor Girl : వినోద్‌‌ను కఠినంగా శిక్షించాలి – వాసిరెడ్డి పద్మ

బాలిక కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని హామీనిచ్చారు. టీడీపీపై విమర్శలు గుప్పించారు వాసిరెడ్డి పద్మ. వినోద్ జైన్ ఎలాంటి వాడో బెజవాడ అందరికీ తెలుసని, టీడీపీ తరఫున కార్పొరేటర్...

vijayawada Minor Girl : వినోద్‌‌ను కఠినంగా శిక్షించాలి – వాసిరెడ్డి పద్మ

Vijayawada Tdp

Updated On : January 30, 2022 / 4:16 PM IST

Woman Commission Chairman Vasireddy Padma : విజయవాడలో బాలిక ఆత్మహత్య ప్రకంపనలు సృష్టిస్తోంది. వినోద్ జైన్ లైంగికంగా వేధించాడని సూసైడ్ నోట్ లో బాలిక పేర్కొంది. వేధింపులు బయటకు చెప్పలేకపోతున్నట్లు, వినోద్ జైన్ చర్యలతో భయాందోళనలకు గురయినట్లు తెలిపింది. దాదాపు రెండు నెలలుగా అతను లైంగికంగా వేధిస్తున్నాడంటూ సూసైడ్ లో వెల్లడించింది. విషయం తెలుసుకున్న మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ ఈ ఘటనపై తీవ్రంగా కలత చెందినట్లు, వినోద్ ను తీవ్రంగా శిక్షించాలన్నారు.

Read More : Hyderabad: హైదరాబాద్ చిన్నారికి ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్

బాలిక కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని హామీనిచ్చారు. టీడీపీపై విమర్శలు గుప్పించారు వాసిరెడ్డి పద్మ. వినోద్ జైన్ ఎలాంటి వాడో బెజవాడ అందరికీ తెలుసని, టీడీపీ తరఫున కార్పొరేటర్ గా పోటీ చేశాడని తెలిపారు. కొత్తగా గుర్తొచ్చినట్టు అతడిని టీడీపీ బహిష్కరించిందని విమర్శించారు. ఒంటరిగా ఉన్న సమయంలో వేధించడంతో బాలిక భయపడినట్లు, అయితే.. కంప్లైంట్ చేసినా రాజకీయ ప్రాబల్యం వల్ల న్యాయం జరగదేమో అని ఆత్మహత్య చేసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మహత్య చేసుకొనే ముందు.. మేడ మీద అటు ఇటు తిరిగిందన్నారు.

Read More : Oil Spill: సముద్ర తీరంలో ఆయిల్ స్పిల్, విపత్తుగా ప్రకటించిన థాయిలాండ్

మరణం తప్ప గత్యంతరం లేదని ఆత్మహత్యకు పాల్పడిందన్నారు. ఈ విషయంలో టీడీపీ నాయకురాలు అనిత ఎలా స్పందిస్తారని, బాలకృష్ణ, లోకేష్, చంద్రబాబులతో క్షమాపణ చెప్పి బయటకు రావాలని డిమాండ్ చేశారు. టీడీపీకి నాయకుల మీద కంట్రోల్ లేదన్నారు. బాలిక కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని మరోసారి హామీనిచ్చారు మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ.