Gang Rape : కత్తులతో బెదిరించి మహిళపై సామూహిక అత్యాచారం

గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. ఓ మహిళపై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు మేడికొండూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.

Gang Rape : కత్తులతో బెదిరించి మహిళపై సామూహిక అత్యాచారం

Woman Rape

Updated On : September 9, 2021 / 10:12 AM IST

Woman gang-raped : మహిళల రక్షణ కోసం నిర్భయ, దిశ లాంటి ఎన్ని చట్టాలు వచ్చినా అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా మరో ఘటన చోటు చేసుకుంది. గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. ఓ మహిళపై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన బుధవారం రాత్రి చోటు చేసుకుంది.

పోలీసుల కథనం ప్రకారం సత్తెనపల్లి మండలానికి చెందిన దంపతులు గుంటూరులో ఓ వివాహ వేడుకకు హాజరై బైక్ పై తిరిగి వస్తున్నారు. మార్గంమధ్యలో మేడికొండూరు మండలం పాలడుగు అడ్డరోడ్డు వద్ద బైక్ పై వస్తున్న దంపతులను దుండగులు అడ్డగించి, వారిపై దాడికి దిగారు. అనంతరం వివాహితను సమీపంలోని పంట పొలాల్లోకి లాక్కెళ్లారు. కత్తులతో బెదిరించి ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు.

బాధితురాలు మేడికొండూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.