Woman Killed : కాకినాడ జిల్లాలో మహిళ దారుణ హత్య.. కత్తితో దాడి చేసి చంపిన దుండగులు

మహిళను చికిత్స నిమిత్తం తుని ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో ఆమె మృతి చెందారు. దాడి చేసిన ఇద్దరు దుండగులు హిందీ మాట్లాడటంతో వారు నార్త్ ఇండియాకు చెందిన వారుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

Woman Killed : కాకినాడ జిల్లాలో మహిళ దారుణ హత్య.. కత్తితో దాడి చేసి చంపిన దుండగులు

Woman Killed (1)

Updated On : July 17, 2023 / 7:15 AM IST

Thugs Woman Killed : కాకినాడ జిల్లాలో మహిళ దారుణ హత్య గావించబడింది. తుని మడలం ఎర్రకోనేరు వద్ద జాతీయ రహదారిపై ఆటో ఆపి డ్రైవర్ పై ఇద్దరు దుండగులు కత్తితో దాడి చేశారు. డ్రైవర్ ను పక్కనున్న మొక్కల్లో పడేసి ఆటో నడుపుకుంటూ వెళ్లిపోయారు. అలాగే కొద్ది దూరం వెళ్లాక చిరు వ్యాపారం చేసుకుంటున్న మహిళపై కూడా దుండగులు కత్తితో దాడి చేసి నగదు కావాలంటూ బెదిరించారు.

మహిళను చికిత్స నిమిత్తం తుని ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో ఆమె మృతి చెందారు. దాడి చేసిన ఇద్దరు దుండగులు హిందీ మాట్లాడటంతో వారు నార్త్ ఇండియాకు చెందిన వారుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

Pakistan spy agent : యూపీలో పాకిస్థానీ గూఢచారి అరెస్ట్

గాయపడిన ఆటో డ్రైవర్ కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న క్లూస్ టీమ్ వివరాలు సేకరించింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అన్ని కోణాల్లో విచారిస్తున్నారు.