Balineni Srinivasa Reddy : నేను ఎవరి జోలికి వెళ్ళను, నా జోలికి ఎవరు వచ్చినా వదిలిపెట్టను- బాలినేని శ్రీనివాసరెడ్డి
అనవసరమైన లీకులు ఇస్తే పార్టీకి ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందని హెచ్చరించారు. నా మీద లేనిపోని ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోను అని వార్నింగ్ ఇచ్చారు బాలినేని. Balineni Srinivasa Reddy

Balineni Srinivasa Reddy Warning (Photo : Facebook)
Balineni Srinivasa Reddy Warning : సీఎం జగన్ తో మాజీమంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి భేటీ ముగిసింది. తన నియోజకవర్గంలో ఇళ్ల పట్టాల సమస్యలపై ముఖ్యమంత్రి జగన్ కి వివరించాను అని ఆయన తెలిపారు. నాలుగైదు రోజుల్లో నిధుల విడుదలకు సంబంధించి క్లియరెన్స్ ఇస్తానని సీఎం చెప్పారని బాలినేని వెల్లడించారు. ముఖ్యమంత్రి జగన్ వచ్చి ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటా అన్నారు అని పేర్కొన్నారు.
Also Read : ప్రభుత్వంపై పెద్ద కుట్ర జరుగుతోంది, జగన్‌ను దూరం చేయాలని చూస్తున్నారు- మంత్రి బొత్స సంచలన వ్యాఖ్యలు
ఒంగోలు నకిలీ స్టాంపుల కుంభకోణంలో సిట్ ఏర్పాటు చేయమని కోరింది నేనే అని బాలినేని తేల్చి చెప్పారు. ఎస్పీకి నాకు మధ్య ఎలాంటి విభేదాలు లేవుని ఆయన స్పష్టం చేశారు. అనవసరమైన లీకులు ఇస్తే పార్టీకి ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందని హెచ్చరించారు. నా మీద లేనిపోని ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోను అని వార్నింగ్ ఇచ్చారు బాలినేని.
నేను ఎవరి జోలికి వెళ్ళను.. నా జోలికి ఎవరు వచ్చినా ఊరుకోను అని బాలినేని అన్నారు. తన రాజకీయ జీవితంలో వివాదాలు లేవన్న బాలినేని.. జిల్లాలో ఉన్న రాజకీయ ఇబ్బందులు ఎప్పుడో ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకెళ్లానని, ఆయనే చూసుకుంటా అన్నారని తెలిపారు. ఈరోజు ప్రత్యేకంగా వాటి గురించి చెప్పలేదన్నారు. సిట్ విచారణ సంతృప్తికరంగా సాగుతోందన్నారు మాజీమంత్రి బాలినేని.
Also Read : చంద్రబాబుపై మరో కేసు.. ఏ-2గా చేర్చిన సీఐడీ