Yarapathineni Srinivasa Rao: ఈ నెలాఖరులోగా వైసీపీ నుంచి వలసలు: యరపతినేని

జనసేన-టీడీపీ పొత్తు ప్రకారం ఎన్ని సీట్లు ఎవరికి అనేది నిర్ణయించారని యరపతినేని శ్రీనివాసరావు అన్నారు.

Yarapathineni Srinivasa Rao: ఈ నెలాఖరులోగా వైసీపీ నుంచి వలసలు: యరపతినేని

Yarapathineni Srinivasa Rao

Updated On : January 17, 2024 / 11:19 AM IST

వైసీపీపై ఆంధ్రప్రదేశ్‌లోని గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు మండిపడ్డారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో వైసీపీ పాలనలో పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేశారని చెప్పారు. ఏపీని అడ్డంగా దోచుకున్నారని ఆరోపించారు.

నెలాఖరులోగా వైసీపీ నుంచి వలసలు ఉంటాయని చెప్పారు. జనసేన-టీడీపీ పొత్తు ప్రకారం ఎన్ని సీట్లు ఎవరికి అనేది నిర్ణయించారని యరపతినేని శ్రీనివాసరావు అన్నారు. కొన్ని సీట్ల విషయంలో ఇరు పార్టీల అధినేతలు ఇద్దరు కలిసి నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. ఏపీ ఎన్నికల్లో వైసీపీ ఓడడం ఖాయమన్నారు. రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేసి జగన్ ప్రజలను ఇబ్బంది పెట్టారని విమర్శించారు.

లిక్కర్ వల్ల రాష్ట్రంలో చాలామంది వ్యాధులబారిన పడ్డారని యరపతినేని శ్రీనివాసరావు చెప్పారు. టీడీపీ నేత నారా లోకేశ్‌పై తప్పుడు కేసులు పెట్టారని అన్నారు. సీఎం జగన్ పోలవరం పూర్తి చేయలేకపోయారని విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్‌ను రాజధాని లేని రాష్ట్రంగా చేశారని చెప్పారు.

సామాజిక మాధ్యమాల్లో తమ కార్యకర్తలపై వైసీపీ అనుచిత వ్యాఖ్యలు చేసిందని యరపతినేని శ్రీనివాసరావు అన్నారు. బీసీ నేతలకు టిక్కెట్లు ఎగ్గొట్టారని చెప్పారు. తన మీద కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. ప్రజా సంక్షేమం గురించి ఆలోచించని వ్యక్తి సీఎంగా ఉన్నారని అన్నారు.

Bhava Kumar: నారా లోకేశ్‌తో భేటీ కానున్న వైసీపీ నేత బొప్పన భవకుమార్