టీడీపీ నేతల కార్లపై వైసీపీ కార్యకర్తల దాడి…మాచర్లలో టెన్షన్

గుంటూరు జిల్లా మాచర్లలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ నేతల కార్లపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. 

  • Published By: veegamteam ,Published On : March 11, 2020 / 08:11 AM IST
టీడీపీ నేతల కార్లపై వైసీపీ కార్యకర్తల దాడి…మాచర్లలో టెన్షన్

Updated On : March 11, 2020 / 8:11 AM IST

గుంటూరు జిల్లా మాచర్లలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ నేతల కార్లపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. 

గుంటూరు జిల్లా మాచర్లలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ నేతల కార్లపై దాడులు జరిగాయి. టీడీపీ నేతల కార్లపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. కొందరు వ్యక్తులు కర్రలతో దాడి చేశారు. ఓ వ్యక్తి కర్రతో కారు అద్దాలను ధ్వంసం చేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. వెంట పడి కార్ల అద్దాలను పగలకొట్టారు. వైసీపీ కార్యకర్తల దాడిలో రెండు కార్లు ధ్వంసం అయ్యాయి.

రోడ్డుపై కారును ఆపి అద్దాలను పగలగొడుతూ, లోపల ఉన్నవారిపై దాడి చేసేందుకు యత్నించినట్లు సమాచారం. బోండా ఉమా మహేశ్వరరావు, బుద్ధా వెంకన్న కర్లపై వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడినట్లు సమాచారం. మిట్ట మధ్యాహ్నం నడిరోడ్డుపై టీడీపీ నేతల కార్లపై దాడులు పాల్పడినట్లు తెలుస్తోంది. వైసీపీ కార్యకర్తల దాడిలో కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. 

తమపై వైసీపీ కార్యకర్తలు విచక్షణరహితంగా దాడి చేశారని బోంబా ఉమ మహేశ్వరరావు చెప్పారు. ఎస్కార్ట్ కోసం వచ్చిన పోలీసులపై కూడా దాడి చేశారని తెలిపారు. వైసీపీ కార్యకర్తలు అందరిపై దాడి చేస్తున్నారని ఆరోపించారు. గన్ మెన్ తుపాకీ చూపించినా అతనిపై దాడి చేశారని తెలిపారు. మాచర్లలో పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేశారని విమర్శించారు. ఫిర్యాదు చేయడానికి వెళ్తే పోలీస్ స్టేషన్ లో ఎవర లేరని బోండా ఉమా తెలిపారు.

రోడ్డుపై అడ్డంగా వాహనాలు పెట్టి కర్రలు, రాడ్లతో దాడి చేశారని బుద్ధా వెంకన్న చెప్పారు. పోలీసులున్నా తమపై దాడికి దిగారని బుద్ధా వెంకన్న తెలిపారు. పోలీసుల ఎస్కార్ట్ ఉన్న సురక్షితంగా వెళ్లలేకపోతున్నామని చెప్పారు. టీడీపీ కోసం చనిపోయినా పర్వాలేదన్నారు.

See Also | నామినేషన్లు వేసేవారిని అడ్డుకుంటే కఠిన చర్యలు : ఈసీ రమేష్ కుమార్